Sudheer Babu | సూపర్‌హీరోల ప్రేమకథ.. నటుడిగా నాకు తృప్తినిచ్చిన సినిమా: సుధీర్‌బాబు
‘నాకు గొప్ప జీవితాన్నివ్వడానికి నాన్న పడ్డ కష్టం నాకు తెలుసు. అందుకే.. సుధీర్‌బాబు సన్నాఫ్ పోసాని నాగేశ్వరరావు అని చెప్పుకోడానికి గర్విస్తా. ఇది సూపర్‌హీరో సినిమా కాదు. కానీ ఆ సినిమాల్లో హీరోలకి వుండే సూపర్ పవర్ ఈ సినిమాలో ఉంటుంది.
Sudheer Babu | ‘నాకు గొప్ప జీవితాన్నివ్వడానికి నాన్న పడ్డ కష్టం నాకు తెలుసు. అందుకే.. సుధీర్‌బాబు సన్నాఫ్ పోసాని నాగేశ్వరరావు అని చెప్పుకోడానికి గర్విస్తా. ఇది సూపర్‌హీరో సినిమా కాదు. కానీ ఆ సినిమాల్లో హీరోలకి వుండే సూపర్ పవర్ ఈ సినిమాలో ఉంటుంది. ఆ పవర్ పేరే ప్రేమ. ఇద్దరు సూపర్‌హీరోల మధ్య సాగే ప్రేమకథ ఇది. నా కెరీర్ మొత్తంలో నటుడిగా నాకు తృప్తినిచ్చిన సినిమా కూడా ఇదే. దర్శకుడు అభిలాష్ కంకర అద్భుతంగా తీశాడు. కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది’ అని సుధీర్‌బాబు అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘మా నాన్న సూపర్‌హీరో’. అర్ణ, సాయిచంద్, షాయాజీ షిండే కీలక పాత్రధారులు.
సునీల్ బలుసు నిర్మాత. అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది. గురువారం జరిగిన ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమంలో సుధీర్‌బాబు మాట్లాడారు. సుధీర్‌బాబు తండ్రిగా నటించడం పట్ల నటుడు షాయాజీ షిండే ఆనందం వెలిబుచ్చారు. ఈ సినిమాలో భాగం కావడం ఆనందంగా ఉందని హీరోయిన్ అర్ణ అన్నారు. ఇంకా దర్శకుడు అభిలాష్ కంకర, నటుడు శశాంక్, సంగీత దర్శకుడు జై క్రిష్ కూడా మాట్లాడారు. రాజు సుందరం, ఆమని ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ కల్యాణి, నిర్మాణం: వి.సెల్యులాయిడ్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

