Mahesh Babu | సర్‌ప్రైజ్‌ల సమాహారం.. హనుమంతుడి ప్రేరణగా మహేశ్ పాత్రను డిజైన్ చేసిన రాజమౌళి!
ఎమోషన్స్‌ను పండించడంలో రాజమౌళి మాస్టర్. టెక్నికల్‌గా ఆయన సినిమాలు బావుంటాయనే చాలామంది అనుకుంటుంటారు.
Mahesh Babu | ఎమోషన్స్‌ను పండించడంలో రాజమౌళి మాస్టర్. టెక్నికల్‌గా ఆయన సినిమాలు బావుంటాయనే చాలామంది అనుకుంటుంటారు. నిజానికి భావోద్వేగాల ఆవిష్కరణే ఆయన ప్రధాన బలం. ‘స్టూడెంట్ నంబర్ 1’ నుంచి ‘ఆర్ఆర్ఆర్’ వరకు ఆయన సినిమాలన్నీ భావోద్వేగ ప్రయాణాలే. రానున్న మహేశ్ సినిమా కూడా కథాపరంగా ఉద్వేగపూరితంగానే ఉంటుందని టాక్ నడుస్తున్నది.
దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ రాసిన ఓ నవల ఆధారంగానే ఈ కథను రాయడం జరిగిందని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ కథ విషయంలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయని సమాచారం. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే నిధి, నిక్షేపాల వేటగా ఈ సినిమా రూపొందనున్నట్టు బయట టాక్ నడుస్తున్నది.
ఇక మహేశ్ పాత్ర విషయంలో ఆసక్తికరమైన వార్త ఒకటి వెలుగు చూసింది. హనుమంతుడ్ని ప్రేరణగా తీసుకొని రాజమౌళి ఆ పాత్రను డిజైన్ చేశారట. అలాగే మహేశ్ లుక్‌ని కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారట. కథాపరంగా ఇందులో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. ఆ ఎపిసోడ్ కోసమే మహేశ్‌బాబు గడ్డం పెంచి రగ్గ్డ్గా మారారని వినికిడి. ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్తికావచ్చిన ఈ సినిమాకు సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మిగతా వివరాలు తెలియాల్సివుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dia Mirza | ఆయనతో పనిచేయడం ఓ పీడకల..! దియా మీర్జా సంచలన వ్యాఖ్యలు
Sreeleela | అందుకే టాలీవుడ్‌కు దూరం..! క్లారిటీ ఇచ్చిన శ్రీలీల
Kamal Haasan| సేయాన్లో విరుమాండి గెటప్.. అతిథి పాత్రలో కనిపించనున్న కమల్‌హాసన్..!
Jain Diksha | కోట్లాది వ్యాపారాన్ని వదిలి సన్యాసం..! సూరత్‌లో ఓ కుటుంబం నిర్ణయం
Senco Jewellers | బీహార్‌లో రూ.40 కోట్ల బంగారం చోరీ.. సెంకో జ్యువెలర్స్ షోరూంలో భారీ దోపిడీ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

