శ్రీకాంత్ తనయ మేధ తెరంగేట్రం
వెండితెరపై మరో వారసురాలు అరంగేట్రం చేస్తున్నది. హీరో శ్రీకాంత్ కుమార్తె మేధ మేక ఓ అందమైన ప్రేమకథా చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నది. ‘మైత్రీ ఇన్ లవ్' పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభమైంది.
వెండితెరపై మరో వారసురాలు అరంగేట్రం చేస్తున్నది. హీరో శ్రీకాంత్ కుమార్తె మేధ మేక ఓ అందమైన ప్రేమకథా చిత్రం ద్వారా కథానాయికగా పరిచయమవుతున్నది. ‘మైత్రీ ఇన్ లవ్’ పేరుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా సోమవారం ప్రారంభమైంది. జై జాస్తి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పృథ్వీ వనం దర్శకత్వం వహిస్తున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి నందిని రెడ్డి క్లాప్‌నివ్వగా, సాహు గారపాటి, అర్చన కెమెరా స్విఛాన్ చేశారు. ‘న్యూఏజ్ రొమాంటిక్ కామెడీ చిత్రమిది. ప్రేమ, హాస్యం, కుటుంబ భావోద్వేగాల కలబోతగా ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొన్నది. ఈ చిత్రానికి సంగీతం: సాయిహర్ష, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: పృథ్వీ వనం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

