Sreeleela | శ్రీలీలకు వరుస ఫ్లాపులు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కూడా దెబ్బతీసినట్టేనా?
Sreeleela | టాలీవుడ్లో సెన్సేషనల్ డెబ్యూతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన శ్రీలీల, చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు దక్కించుకుని బిజీ హీరోయిన్గా మారింది. తన డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం కెరీర్లో కాస్త కఠిన దశను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది.
Sreeleela | టాలీవుడ్లో సెన్సేషనల్ డెబ్యూతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన శ్రీలీల, చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సరసన వరుస అవకాశాలు దక్కించుకుని బిజీ హీరోయిన్గా మారింది. తన డాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో యూత్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ, ప్రస్తుతం కెరీర్లో కాస్త కఠిన దశను ఎదుర్కొంటున్నట్లు కనిపిస్తోంది.‘భగవంత్ కేసరి’ వంటి కొన్ని సినిమాలు మినహా, ఆమె నటించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ నేపథ్యంలో, తాజాగా విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించడం కూడా సినిమాకు హైప్‌ను తీసుకువచ్చింది.
అయితే, సినిమా విడుదల తర్వాత పరిస్థితి ఆశించిన విధంగా లేకపోవడం గమనార్హం. విమర్శకుల నుంచి నెగిటివ్ టాక్ రావడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద కూడా సినిమా ప్రదర్శన సంతృప్తికరంగా లేకపోవడం చిత్రబృందానికి నిరాశ కలిగిస్తోంది. ముఖ్యంగా, ఈ సినిమాలో శ్రీలీల పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం ప్రేక్షకులను నిరుత్సాహానికి గురిచేసింది. పవన్ కళ్యాణ్‌తో జోడీ విషయంలో సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. క్యారెక్టర్ డిజైన్ సరైన స్థాయిలో లేకపోవడం, పెర్ఫార్మెన్స్కు పెద్దగా స్కోప్ లేకపోవడం వంటి అంశాలు విమర్శలకు దారి తీస్తున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో వరుసగా అవకాశాలు అందుకున్న శ్రీలీల, ఇప్పుడు తన ఫామ్‌ను తిరిగి అందుకోవడానికి కృషి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక, వరుస పరాజయాలు వచ్చినప్పటికీ, శ్రీలీల తన రెమ్యూనరేషన్ తగ్గించలేదన్న వార్తలు కూడా పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. దీనితో పలువురు నిర్మాతలు ఇతర హీరోయిన్లను ఎంపిక చేసుకునే దిశగా మొగ్గు చూపుతున్నారని సమాచారం. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా క్రేజీ ప్రాజెక్టులు లేకపోవడం కూడా ఆమె కెరీర్‌పై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో, శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్‌పై దృష్టి సారించినట్లు టాక్ వినిపిస్తోంది. కొత్త అవకాశాల కోసం హిందీ చిత్రసీమలో ప్రయత్నాలు ప్రారంభించిందని సమాచారం. టాలీవుడ్లో తిరిగి తన స్థానాన్ని సంపాదించుకోవడానికి ఆమె ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

