Sonali Kulkarni | ముంబై ట్రాఫిక్‌లో ‘ది ప్యారడైజ్’ నటి నరకయాతన.. ఏకంగా 5 గంటల పాటు రోడ్డుపైనే!
Sonali Kulkarni | ముంబై మహానగరంలోని ట్రాఫిక్ కష్టాలు సామాన్యులకే కాదు, సెలబ్రిటీలకు కూడా చుక్కలు చూపిస్తున్నాయి.
Sonali Kulkarni | ముంబై మహానగరంలోని ట్రాఫిక్ కష్టాలు సామాన్యులకే కాదు, సెలబ్రిటీలకు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. నాని నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’లో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ నటి సోనాలి కుల్కర్ణికి ఇటీవల ముంబై ట్రాఫిక్‌లో ఒక భయానక అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి ముంబై నుంచి పూణేకు ప్రయాణిస్తుండగా మాంఖుర్ద్ బ్రిడ్జి సమీపంలో ఆమె ఏకంగా 5 గంటల పాటు వాహనంలోనే చిక్కుకుపోయారు. ఆ ప్రాంతంలో ఫ్లైఓవర్ పనుల కోసం ఉపయోగిస్తున్న ఒక భారీ క్రేన్ అకస్మాత్తుగా కూలిపోవడంతో ఈ భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ దుర్ఘటనలో ఒక పోలీస్ కానిస్టేబుల్ దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోగా, కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
అయితే ఈ నరకయాతనను వివరిస్తూ సోనాలి కుల్కర్ణి సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేసింది. గత ఐదు గంటలుగా ఇక్కడే ఉండిపోయాను, అంగుళం కూడా ముందుకు కదలలేని పరిస్థితి ఉంది. కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేస్తే ఓపిక పట్టమని చెబుతున్నారు తప్ప క్లియరెన్స్‌పై స్పష్టత లేదు. ఆకలి గురించి ఆలోచించలేని స్థితిలో ఉన్నాం, మా కోసం ప్రార్థించండి, ఇది నిజంగా భయంగా ఉంది అంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో పేర్కొన్నారు. ఒక ప్రముఖ నటికే ముంబై నడిబొడ్డున ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, మౌలిక సదుపాయాల వైఫల్యంపై విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ‘దిల్ చాహతా హై’, ‘సింగం’ వంటి చిత్రాలతో అలరించిన సోనాలి, ప్రస్తుతం తెలుగులో ‘ది ప్యారడైజ్’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
Pune Bound Travellers Go Through Nightmare Due To Heavy Congestion At Mankhurd; Actress Sonali Kulkarni Stuck For 5 Hours https://t.co/iwxfvLM3dq pic.twitter.com/WzUrjF077n
— Pune Pulse (@pulse_pune) April 30, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

