Skanda New Trailer | ‘సీఎం’ అయితే ట్రాఫిక్ లొల్లి ఉండదు, పైప్ పెట్టి ఊదుడు ఉండదు.. స్కంద నుంచి మరో ట్రైలర్ రెడీ చేస్తున్న మేకర్స్
Skanda Trailer | రామ్ పోతినేని, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం స్కంద (Skanda). ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మాస్ కా బాప్ రేంజ్లో హీరోలను ఎలివేట్ చేసే బోయపాటి.. లవర్‌బోయ్ రామ్‌ను ఎలా చూపిస్తాడని అంతా అనుకుంటున్నారు.
Skanda Trailer | రామ్ పోతినేని, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం స్కంద (Skanda). ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మాస్ కా బాప్ రేంజ్లో హీరోలను ఎలివేట్ చేసే బోయపాటి.. లవర్‌బోయ్ రామ్‌ను ఎలా చూపిస్తాడని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు, టీజర్, ట్రైలర్లను విడుదల చేయగా.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు.
ఈ మూవీ నుంచి కొత్త ట్రైలర్‌ను ఈరోజు జరుగబోయే స్కంద ప్రీ రిలీజ్ ఈవెంట్లో లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీనికి సంబంధించి ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమోలో ”నువ్వేం కావాలి అనుకుంటున్నావు అని టీచర్ రామ్ ని అడిగితే.. సీఎం కావాలి అనుకుంటున్నా అని షాకింగ్ రిప్లయ్ ఇస్తాడు. ఎందుకు అంటే. ఆ పోస్టుల దమ్ముంది సార్. ఎటు వెళ్లిన ట్రాఫిక్ సిగ్నల్ లొల్లి ఉండదు, పైప్ పెట్టి ఊదుడు ఉండదు. మన బర్త్‌డే అయితే స్టేట్ మొత్తం మన ఫ్లెక్సీలు లేస్తాయి. అంటూ రామ్ పోతినేని చెప్పిన పంచ్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28 ప్రేక్షకుల ముందుకు రానుంది.
Skanda 2nd trailer 🥵💥💥
Last lo short mathram ARACHAKAM anthe 🥵#Skanda #SkandaOnSep28 #SkandaBookings #RAmPOthineni pic.twitter.com/7Eanxg1jj1
— Rapo__vijay_status (@JayaBhagavan2) September 24, 2023
ఇదిలా ఉండగా.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. సోమవారం రోజు కరీంనగర్‌లోని వీ కన్వెన్షన్ హాల్లో సాయంత్రం 6గంటల నుంచి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరుగనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన అన్ని పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాకు ఇప్పటికే ఓ రేంజ్లో బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. స్టార్ సంస్థ సౌత్‌లోని అన్ని భాషల నాన్-థియేట్రికల్ హక్కులు దాదాపు రూ.50 కోట్లకు కొనుక్కుందని టాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

