సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్‌గా నిలిచింది సితార ఎంటర్టైన్మెంట్స్ (Sitara Entertainments). ఇటీవలే పవన్ కల్యాణ్ తో భీమ్లా నాయక్ సినిమా తెరకెక్కించి మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సితార ఇపుడు మరో ముందడుగు వేయబోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ (overseas distribution business)లోకి ఎంటర్ కాబోతుంది.
తాజా అప్ డేట్ ప్రకారం ఆర్ఆర్ఆర్ ఆస్ట్రేలియన్ హక్కుల( Australian rights)ను రూ.6.5 కోట్లకు సితార దక్కించుకున్నట్టు వార్త ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు సితార కేవలం సినిమాలను నిర్మించడంలో బిజీగా ఉంది. స్థానిక డిస్ట్రిబ్యూషన్ టీంతో మంచి నెట్వర్క్ మెయింటైన్ చేస్తూ వస్తోంది. కానీ ఇపుడు ఏకంగా ఎవరూ ఊహించని విధంగా ఓవర్సీస్ లోకి ఎంటరవడం, అది కూడా ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమాతో వస్తుండటం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సితార ఎంటర్టైన్ మెంట్స్ అధినేత సూర్య దేవర నాగవంశి ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ విషయంలో ఆసక్తి కనబర్చడంతో ఆర్ఆర్ఆర్ డిస్ట్రిబ్యూషన్ టీం ఓవర్సీస్ రైట్స్ ను అమ్మేసినట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్.