singer palak muchhal: సంగీత దర్శకుడిని పెళ్లి చేసుకున్న సింగర్ పాలక్ మచ్చల్
బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకున్న సింగర్ పాలక్ ముచ్చల్
బాలీవుడ్లో మరో జంట పెళ్లిపీటలు ఎక్కింది. ప్లే బ్యాక్ సింగర్ పాలక్ ముచ్చల్ తన బాయ్‌ఫ్రెండ్ అయిన సంగీత దర్శకుడు మిథూన్ శర్మని వివాహం చేసుకుంది. వీరి వివాహం ముంబైలో ఆదివారం వైభవంగా జరిగింది. చాలా రోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఎంబ్రాయిడరీ, ఎరుపు రంగు లెహెంగాలో పాలక్, మిథూన్ గోధుమ రంగు షేర్వానీలో మెరిసిపోయారు. తమ పెళ్లి ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఈ కొత్తజంట. ‘ఎల్లప్పుడూ కలిసి ఉండాలని ఈరోజు మేమిద్దరం ఒక్కటయ్యాం’ అని క్యాప్షన్ రాశారు.
వెల్లువెత్తిన అభినందనలు
తమ వివాహ వేడుకకు సినిమా ఇండస్ట్రీకి చెందిన కొద్దిమంది స్నేహితులు, బంధువులను మాత్రమే ఆహ్వానించారు పాలక్, మిథూన్లు. సింగర్ ఉదిత్ నారాయణ్, అర్మాన్ మాలిక్, సోనూ నిగమ్, కైలాష్ ఖేర్, నిర్మాత క్రిషికా లుల్లా, భారత జట్టు మహిళా క్రికెటర్ స్మృతికా మంధానా, టీవీ నటి రుబినా ధిల్లాక్, అభినవ్ శుక్ల వీరి వివాహ రిసెప్షన్‌కి హాజరయ్యారు. పెళ్లితో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన పాలక్, మిథూన్కి బాలీవుడ్ ప్రముఖులు అభినందనలు తెలిపారు. ‘మీ జంట చూడముచ్చటగా ఉంది’ అంటూ సోషల్‌మీడియాలో కామెంట్లు పెడుతున్నారు చాలామంది. ఏక్ థా టైగర్, ఆషికీ 2, కిక్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, ఎం.ఎస్.ధోనీ, కాబిల్ వంటి సినిమాల్లో పాటలు పాడింది పాలక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

