గాలి వార్తల్ని ఎందుకు నమ్ముతారు?
ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శంతను, శ్రుతిహాసన్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లిపై గతంలో చాలా వార్తలొచ్చాయి. అయితే వాటన్నింటినీ శ్రుతి ఖండించుకుంటూ వచ్చింది. తాజాగా శ్రుతి, శంతన్ల వివాహం జరిగిపోయినట్టు ఓ మీడియా ప్రముఖుడు ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు.
ప్రముఖ డూడుల్ ఆర్టిస్ట్ శంతను, శ్రుతిహాసన్ కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి పెళ్లిపై గతంలో చాలా వార్తలొచ్చాయి. అయితే వాటన్నింటినీ శ్రుతి ఖండించుకుంటూ వచ్చింది. తాజాగా శ్రుతి, శంతన్ల వివాహం జరిగిపోయినట్టు ఓ మీడియా ప్రముఖుడు ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. దాంతో అదే నిజమనుకొని కొన్ని ఛానల్స్ కథనాలు కూడా ప్రసారం చేశాయి.
ఈ నేపథ్యంలో శ్రుతికి స్పందించక తప్పలేదు. ‘ నాకు ఇంకా పెళ్లి కాలేదు. అన్ని విషయాలనూ అందరితో పంచుకునే నేను పెళ్లి గురించి మాత్రం ఎందుకు దాస్తాను? నేను చెబితే అది నిజమవుతుంది. ఎవరుపడితే వాళ్లు నా పెళ్లి గురించి మాట్లాడితే అది నిజం ఎలా అవుతుంది? అసలు ఇలాంటి గాలి వార్తలను ఎందుకు నమ్ముతారు?’ అంటూ రుసరుసలాడింది శ్రుతిహాసన్. ఇక శ్రుతిహాసన్ చేస్తున్న సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది వాల్తేరువీరయ్య, వీరసింహారెడ్డి, సలార్ సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ కొట్టింది శ్రుతి. ప్రస్తుతం అడివిశేషు ‘డెకాయిట్’లో నటిస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

