Santosh Shoban | సంతోష్‌శోభన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రేమ్‌కుమార్’. అభిషేక్ మహర్షి దర్శకుడు. సారంగ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివప్రసాద్ పన్నీరు నిర్మించారు. నేడు విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో సంతోష్ శోభన్ గురువారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘కొన్ని తెలుగు సినిమాల ైక్లెమాక్స్‌లో పీటల మీద ఆగిపోయే పెళ్లిళ్లను చూపిస్తుంటారు. అందులో చివరగా హీరో వచ్చి హీరోయిన్ను పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లికొడుకు పరిస్థితి గురించి ఎవరూ ఆలోచించరు. అతని కోణంలో రాసుకున్న కథే ఇది. తెలుగు సినిమాలో ఇప్పటివరకు రానటువంటి సరికొత్త కథ అని చెప్పొచ్చు.
కెరీర్‌పరంగా ఇప్పటివరకు నాకు థియేట్రికల్ సక్సెస్ రాలేదు. అయితే ఈ సినిమా ఆ లోటును తీర్చుతుందని భావిస్తున్నా. నాకు పెళ్లిబట్టలు చూస్తేనే డిప్రెషన్ వస్తుంది. పెళ్లి తతంగానికి దూరంగా ఉంటే మంచిదనిపిస్తుంది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటా. యూవీ క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్లో నా తదుపరి చిత్రాలను చేయబోతున్నా’ అన్నారు.