Samyuktha Menon | గుర్రంపై సవారీ చేస్తున్న సంయుక్త.. ఆ సినిమా కోసమేనా?
నా తదుపరి చిత్రం ‘స్వయంభు’ కోసం, నేను గుర్రపుస్వారీ నేర్చుకుంటున్నా. నిజంగా ఇది అద్భుతమైన ప్రయాణం. మేమందరం ఒక టీమ్‌గా కలిసి పనిచేస్తున్నాం.’
Samyuktha Menon | ‘నా తదుపరి చిత్రం ‘స్వయంభు’ కోసం, నేను గుర్రపుస్వారీ నేర్చుకుంటున్నా. నిజంగా ఇది అద్భుతమైన ప్రయాణం. మేమందరం ఒక టీమ్‌గా కలిసి పనిచేస్తున్నాం.’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది సంయుక్త మీనన్. ఆమె నిఖిల్ కథానాయకుడిగా రూపొందుతోన్న చారిత్రాత్మక చిత్రం ‘స్వయంభు’లో కథానాయికగా నటిస్తున్నది. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. భువన్, శ్రీకర్ నిర్మాతలు. హీరో నిఖిల్ 20వ చిత్రంగా ఈ సినిమా రూపొందుతున్నది. ఇందులో హీరో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నాడని, అందుకే పలు యుద్ధవిద్యల్లో ప్రావీణ్యం పొందే పనిలో నిఖిల్ బిజీగా ఉన్నాడని చిత్రబృందం తెలిపింది.
ఈ సినిమాలో అద్భుతమైన యుద్ధ సన్నివేశాలు ఉంటాయని, గతంలో ఎన్నడూ చూడని భయంకరమైన పోరాటాలను ఇందులో చూస్తారని వారు తెలిపారు. ఇంకా చెబుతూ ‘ఇందులో సంయుక్త మీనన్ పాత్ర కథలో చాలా కీలకం. కథానుగుణంగా నిఖిల్‌తోపాటు ఆమె కూడా కొన్ని యుద్ధ సన్నివేశాల్లో పాల్గొంటారు. అందుకోసమే గుర్రపుస్వారీతోపాటు యుద్ధ విద్యల్ని కూడా నేర్చుకుంటున్నారు’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: వాసుదేవ్ మునెప్ప, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: రవి బస్రూర్, నిర్మాణం: పిక్సెల్ స్టూడియోస్, సమర్పణ: ఠాగూర్ మధు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gulam Nabi Azad | భారత్‌తోపాటు కశ్మీర్ ప్రజలకూ పాకిస్థాన్ శత్రువే : గులాం నబీ ఆజాద్
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

