BRO The Avatar | ఇంతకీ పవన్ కల్యాణ్ బ్రో ఒరిజినల్ టైటిల్ ఏంటో తెలుసా..?
BRO The Avatar | ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో వస్తోన్న బ్రో (Bro The Avatar) చిత్రానికి సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహిస్తున్నాడు. బ్రో (జులై 28న) మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా సినిమా ఒరిజినల్ టైటిల్‌కు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
BRO The Avatar | పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగా అభిమానులు ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ బ్రో (Bro The Avatar). ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి సముద్రఖని (Samuthirakani) దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan), సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రియా ప్రకాశ్ వారియర్, కేతిక శర్మ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. బ్రో (జులై 28న) మరికొన్ని గంటల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఇదిలా ఉంటే తాజాగా సినిమా ఒరిజినల్ టైటిల్‌కు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
బ్రో చిత్రానికి ముందుగా ఒరిజినల్ టైటిల్ కాల పురుషుడు అనుకున్నామని, ఆ తర్వాత బ్రోగా మార్చామని డైరెక్టర్ కమ్ యాక్టర్ సముద్రఖని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మేకర్స్ బ్రో బీటీఎస్ ఫొటోలను షేర్ చేశారు. పవన్ కల్యాణ్ డిఫరెంట్ గెటప్స్‌లో నిర్మాత వివేక్ కూచిబొట్లతో చిట్‌చాట్ చేస్తున్న స్టిల్‌తోపాటు త్రివిక్రమ్‌తో మాట్లాడుతున్న ఫొటోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన బ్రో టీజర్, ట్రైలర్ నెట్టింట మంచి వ్యూస్ రాబడుతున్నాయి.

Samuthirakani
బ్రో నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. సాయిధరమ్ తేజ్, పవన్ కల్యాణ్ కాంబోలో వచ్చే మై డియర్ మార్కండేయ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకుంటోంది. మరోవైపు రొమాంటిక్ మెలోడి జానవులే లిరికల్ వీడియో సాంగ్ ఆన్లైన్లో హల్ చల్ చేస్తోంది. సాయి ధరమ్ తేజ్, టైమ్ లైన్, పవన్ కల్యాణ్ మధ్య సాగే ఘటనల నేపథ్యంలో బ్రో ఉండబోతున్నట్టు టీజర్‌తో చెప్పేశాడు సముద్రఖని.
ఈ చిత్రంలో రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్లభరణి, సుబ్బరాజు, రాజా చెంబోలు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తుండగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ అందిస్తున్నారు.
బ్రో వర్కింగ్ స్టిల్స్..
Bro The Avatar1
My Time with #BRO
Infinite Interactions …@PawanKalyan garu@peoplemediafcy @vishwaprasadtg garu@thondankani garu pic.twitter.com/V3dIF6jyWh— Vivek Kuchibhotla (@vivekkuchibotla) July 25, 2023
బ్రో ట్రైలర్..
బ్రో టీజర్..
జానవులే లిరికల్ వీడియో సాంగ్..
మై డియర్ మార్కండేయ సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

