Shaakuntalam | శాకుంతలం, దుష్యంతుడి లవ్ జర్నీతో ట్రైలర్ టైం ఫిక్స్
సమంత (Samantha) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం శాకుంతలం (Shaakuntalam). పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ గుణ శేఖర్ (Guna Sekhar) దర్శకత్వం వహిస్తున్నాడు. పురాణ ప్రేమ గాథ.. శాకుంతలం ప్రపంచంలోకి వెళ్లేందుకు రెడీగా ఉండండి.. అంటూ ట్రైలర్ అప్డేట్ అందించారు.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది టాలీవుడ్ భామ సమంత (Samantha). ఈ బ్యూటీ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం శాకుంతలం (Shaakuntalam). పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ గుణ శేఖర్ (Guna Sekhar) దర్శకత్వం వహిస్తున్నాడు. శాకుంతలం ట్రైలర్‌ను జనవరి 9న మధ్యాహ్నం 12:06 గంటలకు లాంఛ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
పురాణ ప్రేమ గాథ.. శాకుంతలం ప్రపంచంలోకి వెళ్లేందుకు రెడీగా ఉండండి.. అంటూ ట్రైలర్ అప్డేట్ అందించారు. పచ్చని చెట్లు, సెలయేళ్ల మధ్యలో శాకుంతలం, దుష్యంతుడి ప్రేమ మత్తులో మునిగిపోయిన లేటెస్ట్ లుక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. మైథలాజికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఎంత కలర్ఫుల్గా ఉండబోతుందో తాజా లుక్‌తో తెలిసిపోతుంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్. కాగా గుణ టీమ్ వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. శాకుంతలం చిత్రానికి సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. ఈ మూవీలో అనన్య నాగళ్ల, అదితీ మోహన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శాకుంతలం ట్రైలర్ అప్డేట్..
A whimsical tale of epic love beckons 🤍🦢
Get ready to enter the world of #Shaakuntalam! #ShaakuntalamTrailer on Jan 9th at 12:06 PM✨@Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @tipsofficial #MythologyforMilennials pic.twitter.com/v03aq7trQw
— Gunaa Teamworks (@GunaaTeamworks) January 6, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

