Kaathal The Core Movie | ఈ ఏడాది ఇదే ఉత్తమ చిత్రం.. మమ్ముట్టి సినిమాపై ప్రశంసలు కురిపించిన సమంత
Kaathal The Core Movie | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, కోలీవుడ్ నటి జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'కాథల్ ది కోర్. 'నాన్ పాకల్ నేరతు మాయక్కమ్', 'క్రిస్టోఫర్', 'కన్నూర్ స్క్వాడ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత మమ్ముట్టి నటించిన తాజా చిత్రమిది.
Kaathal The Core Movie | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, కోలీవుడ్ నటి జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కాథల్ ది కోర్. ‘నాన్ పాకల్ నేరతు మాయక్కమ్’, ‘క్రిస్టోఫర్’, ‘కన్నూర్ స్క్వాడ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత మమ్ముట్టి నటించిన తాజా చిత్రమిది. స్వలింగ సంపర్కుల పట్ల (Homosexuals) సమాజం ప్రవర్తించే తీరును ఆధారంగా చేసుకుని జియో బేబి ఈ సినిమాను తెరకెక్కించగా నవంబర్ 23న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం చూసిన టాలీవుడ్ స్లార్ నటి సమంత (Samantha) సినిమాపై ప్రశంసల వర్షం కురిపించింది.
ఈ సినిమాపై సమంత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ” ‘కాథల్-ది కోర్’ సినిమా అద్భుతంగా ఉంది. ఈ ఏడాదిలో నేను చూసిన ఉత్తమ చిత్రం ఇదే. అందరూ చూడాల్సిన ఒక పవర్ఫుల్ సినిమా. మమ్ముట్టి సర్ మీరు నా హీరో. ఇందులో మీ నటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమా ఫీల్ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నా. మంచి సినిమా చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. లవ్యూ జ్యోతిక, జియో బేబి మీరు దిగ్గజం అంటూ సమంత ఇన్‌స్టా వేదికగా రాసుకోచ్చింది.
ఈ సినిమా కథలోకి వెళితే.. బ్యాంకులో పని చేసి రిటైర్ అయిన జార్జ్ (మమ్ముట్టి).. భార్య ఓమన(జ్యోతిక)తో కలిసి తీకోయ్ అనే చిన్న గ్రామంలో నివసిస్తుంటాడు. ఆ గ్రామంలో ఎన్నికలు రావడంతో మమ్ముట్టి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. అయితే అతడు నామినేషన్ వేసిన తర్వాత జ్యోతిక అతడిపై విడుకుల కోసం కోర్టులో కేసు ఫైల్ చేస్తుంది. డ్రైవింగ్ స్కూల్ నడిపే వ్యక్తితో జార్జ్ స్వలింగ సంపర్క బంధం ఉందని అందుకే విడాకులు కావాలని కోరుతుంది. అయితే ఈ ఆరోపణలను మమ్ముట్టి ఖండిస్తాడు. అయితే ఆ తరువాత ఎం జరిగింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉందని కువైట్, ఖతార్ దేశాలు ఈ సినిమాను తాజాగా బ్యాన్ చేశాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

