Rudhrudu Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న’రుద్రుడు’ మూవీ టీజర్ గ్లింప్స్..!
Rudhrudu Movie Teaser Glimps | ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ ఓ వైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరో వైపు హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. కాంచన-3 తర్వాత మూడేళ్ళు గ్యాప్ తీసుకుని రుద్రుడు సినిమాతో లారెన్స్ ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు.
Rudhrudu Movie Teaser Glimps | ప్రముఖ కొరియోగ్రాఫర్ లారెన్స్ ఓ వైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరో వైపు హీరోగా ఫుల్ బిజీగా ఉన్నాడు. కాంచన-3 తర్వాత మూడేళ్ళు గ్యాప్ తీసుకుని రుద్రుడు సినిమాతో లారెన్స్ ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కధిరేశన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమా టీజర్ గ్లింప్స్‌ను రిలీజ్ చేసింది.
అన్న చంపింది రౌడీనో.. వేటగాడో కాదు. వేరే ఎవడో ఒకడు అంటూ టీజర్ గ్లింప్స్ స్టార్ట్ అయింది. గ్లింప్స్‌లో విలన్లు లారెన్స్ వెనకాల పరిగెత్తడం, లారెన్స్ కత్తితో వాళ్ళపై ఎదురు దాడి చేయడం గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. జీవి ప్రకాష్ నేపథ్య సంగీతం బాగుంది. టీజర్‌తోనే సినిమాపై చిత్రబృందం భారీ అంచనాలు క్రియేట్ చేసింది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైవ్ స్టార్ క్రియేషన్స్ బ్యానర్‌పై కదిరేశన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నాడు. లారెన్స్‌కు జోడీగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్గా నటిస్తుంది. జీ.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నిజానికి ఈ చిత్రం డిసెంబర్ 23న విడుదల కావాల్సి ఉంది. కానీ వీఎఫ్ఎక్స్ కారణంగా నాలుగు నెలలు వాయిదా పడింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

