‘నిర్మలా కాన్వెంట్’, ‘పెళ్లి సందడి’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన యువ హీరో రోషన్. హీరో శ్రీకాంత్ తనయుడైన రోషన్ పరిశ్రమలో తనదైన గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు. రోషన్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర వివరాలను అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. కథా కథనాలు ఆసక్తికరంగా ఉన్నాయని, రోషన్‌ను సరికొత్త పాత్రలో చూస్తారని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాలో నటించే నటీనటులు, పనిచేయబోయే సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.