చంద్రకళ కలల్లో కూడా కళలే..
యువ కథానాయకుడు రోషన్ నటిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్'. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకుడు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
యువ కథానాయకుడు రోషన్ నటిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’. జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకుడు. స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల కానున్నది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చిందని మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇందులో కథానాయికగా నటిస్తున్న అనస్వర రాజన్ పోషిస్తున్న ‘చంద్రకళ’ పాత్రను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు.
ధైర్యసాహసాలున్న పల్లెటూరి అమ్మాయి పాత్రను ఇందులో ఆమె పోషిస్తున్నట్టు గ్లింప్స్ చెబుతున్నది. నాటక కళాకారిణిగా ఎదిగి, తనకంటూ ఓ నాటక బృందాన్ని స్థాపించాలనే ఆశతో ముందుకెళ్లే అమ్మాయి చంద్రకళ. ఈ కథలో చంద్రకళ పాత్ర ఎంత కీలకమో గ్లింప్స్‌లోని సన్నివేశాలు చెబుతున్నాయి. దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని చిత్రబృందం చెబుతున్నది. ఈ సినిమాలోని నాయకానాయికల ప్రేమకథ మనసుల్ని తాకేలా ఉంటుందని వారంటున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.మది, సంగీతం: మిక్కీ జె.మేయర్, సమర్పణ: జీ స్టూడియోస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

