Bandi Sanjay | బండి సంజయ్ కొడుకు వివాదం.. సద్దాం హుస్సేన్ కొడుకుతో పోలుస్తూ ఆర్జీవీ పాత పోస్ట్ వైరల్
Bandi Sanjay | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ భారతీయ జనతా పార్టీ కీలక నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Bandi Sanjay | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ భారతీయ జనతా పార్టీ కీలక నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఒక 17 ఏళ్ల బాలికకు బలవంతంగా మద్యం తాగించి, హైదరాబాద్‌లోని మొయినాబాద్ ఫామ్‌హౌస్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వేధింపుల కారణంగా బాధితురాలు రెండుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు సమాచారం. చివరికి నిన్న అర్ధరాత్రి ఆమె పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే, మొదట్లో బండి భగీరథ్‌పై కేసు నమోదు చేసేందుకు పోలీసులు వెనుకాడటంతో పోలీస్ స్టేషన్ వద్ద సుమారు ఆరు గంటల పాటు హైడ్రామా చోటుచేసుకుంది. ఆ తర్వాత బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
అయితే ఈ కేసు అనంతరం బండి సంజయ్ కొడుకు భగీరాథ్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు. ఇంతకుముందు కూడా కాలేజీలో ఒక విద్యార్థిపై దాడి చేసి భగీరాథ్ వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే భగీరథ్‌పై పాత వివాదాల నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గతంలో చేసిన ట్వీట్ ఇప్పుడు మళ్ళీ వైరల్‌గా మారింది. భగీరథ్‌ను ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ కుమారుడు ఉదయ్ హుస్సేన్‌తో పోలుస్తూ ఆర్జీవీ అప్పట్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.
ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ కుమారుడు ఉదయ్ హుస్సేన్ వంటి వారి రోజులు ముగిసిపోయాయని నేను అనుకున్నాను. కానీ అతను ఇప్పుడు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ రూపంలో మళ్ళీ పుట్టినట్లు ఉన్నాడు. తండ్రి పరువు తీయడంలో ఇతను తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు అంటూ రామ్ గోపాల్ వర్మ రాసుకోచ్చాడు. దీంతో ఈ పోస్ట్‌ని నెటిజన్లు మళ్లీ ఇప్పుడూ రీ ట్వీట్ చేస్తున్నారు.
I thought the days of Iraq dictator #Saddam ‘s like sons #UdayHussein were over and now he is reincarnated as @bandisanjay_bjp ‘s son #bhageerqth who as a son YUCKED his FATHER pic.twitter.com/Btzfc4i8ya
— Ram Gopal Varma (@RGVzoomin) January 17, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

