RGV | ‘ధురంధర్2’ స్ఫూర్తి .. కంగనా మాటలతో కొత్త ఆర్జీవీ కనిపించబోతున్నాడా..!
RGV | విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన పుట్టినరోజు వేడుకలను ముంబైలో సినీ ప్రముఖుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ వేడుకల కంటే ఎక్కువగా ఆయన సోషల్ మీడియాలో చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.కేక్ కట్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. “నా గతాన్ని ధురంధర్2 అనే కత్తితో పొడుస్తున్నాను” అంటూ వర్మ చేసిన కామెంట్ వైరల్గా మారింది.
RGV | విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన పుట్టినరోజు వేడుకలను ముంబైలో సినీ ప్రముఖుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ వేడుకల కంటే ఎక్కువగా ఆయన సోషల్ మీడియాలో చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.కేక్ కట్ చేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. “నా గతాన్ని ధురంధర్2 అనే కత్తితో పొడుస్తున్నాను” అంటూ వర్మ చేసిన కామెంట్ వైరల్గా మారింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘ధురంధర్: ది రివెంజ్’ స్ఫూర్తితో తన పాత వైఫల్యాలను మరచి, కొత్త ప్రయాణం ప్రారంభించబోతున్నానని ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా సంకేతాలు ఇచ్చారు.
ఇటీవల వరుసగా విమర్శలు ఎదుర్కొన్న వర్మ.. నాణ్యతలేని సినిమాలు తీస్తున్నారనే అభిప్రాయంతో తన ఇమేజ్ దెబ్బతిన్న నేపథ్యంలో, ఈ పోస్ట్ ఆయనలో వచ్చిన మార్పును సూచిస్తోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదిలా ఉండగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ వర్మకు మద్దతుగా నిలవడం ఈ చర్చను మరింత వేడెక్కించింది. తన కెరీర్ ప్రారంభ దశలో వర్మ సినిమాలు ఎంతగా ప్రభావం చూపాయో కంగనా గుర్తుచేసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి జిల్లాలో ఉన్నప్పుడు థియేటర్లు లేకపోయినా, ఆయన సినిమాల డీవీడీలు తెప్పించుకుని చూసేదాన్నని తెలిపారు. ఆ సినిమాలే తనను సినిమా రంగం వైపు నడిపించాయని, ముంబైకి వచ్చి నటిగా ఎదగాలనే కలలు కలిగించాయని కంగనా చెప్పడం విశేషం. ఆమె వ్యాఖ్యలు వర్మకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
కంగనా ప్రశంసలకు వర్మ తనదైన శైలిలో స్పందించారు. నన్ను మరీ ఇంత ప్రాచీన వ్యక్తిని చేసినందుకు ధన్యవాదాలు” అంటూ చమత్కరించారు. అదే సమయంలో ఆమె భావాలను గౌరవిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ధురంధర్ విజయం తనకు ఒక బెంచ్మార్క్గా మారిందని, దాన్ని మించే చిత్రాలను రూపొందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతానని వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు. భవిష్యత్తులో మళ్లీ తన పాత వైభవాన్ని చాటుకునే సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తానని హామీ ఇచ్చారు. మరి ఒకప్పుడు ఇండియన్ సినిమాకు కొత్త దిశ చూపిన ఈ దర్శకుడు మళ్లీ అదే స్థాయిలో సినిమాలు చేసి మెప్పిస్తారా అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘జూలూరుపాడును కరువు మండలంగా ప్రకటించాలి’
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

