బాలీవుడ్లోదక్షిణాదిపై వివక్ష
దక్షిణాది చిత్రాల్లో కథానాయికల పాత్ర చిత్రణ, వివక్షపై అగ్ర కథానాయికలు జాన్వీకపూర్, రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందీ చిత్రాల్లో దక్షిణాది తారలపై చూపించే వివక్ష గురించి కథానాయిక రెజీనా కాసాండ్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.
దక్షిణాది చిత్రాల్లో కథానాయికల పాత్ర చిత్రణ, వివక్షపై అగ్ర కథానాయికలు జాన్వీకపూర్, రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హిందీ చిత్రాల్లో దక్షిణాది తారలపై చూపించే వివక్ష గురించి కథానాయిక రెజీనా కాసాండ్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ చిత్రాల్లో దక్షిణాది కథానాయికలపై వివక్ష ఉంటుందని పేర్కొన్నది. ధర్మ ప్రొడక్షన్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించిన ‘కేసరి-2’ చిత్రంలో తాను అక్షయ్ కుమార్ భార్యగా నటించానని, సినిమాలో తన పాత్రకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ ప్రమోషన్స్‌లో తన పేరును ప్రస్తావించలేదని రెజీనా ఆవేదన వ్యక్తం చేసింది.
సినిమాలోని ఓ పాటను విడుదల చేసి, సోషల్‌మీడియాలో కనీసం తనను ట్యాగ్ కూడా చేయలేదని రెజీనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘కరణ్‌జోహార్ షోలో జాన్వీకపూర్ మహిళల పాత్రల గురించి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. మరి అదే కరణ్జోహార్కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్ నా విషయంలో ఎందుకు అలా వ్యవహరించిందో అర్థం కావడం లేదు. ఉత్తరాదిలో నన్ను సౌత్ ఇండియన్‌గానే చూస్తారు. అందుకే తగిన గుర్తింపు దక్కడం లేదు. నాకు తమిళం కంటే హిందీ బాగా వచ్చు. అయినా బాలీవుడ్లో ప్రాంతీయ వివక్ష ఎదుర్కోవాల్సి వస్తున్నది’ అని రెజీనా ఆవేదన వ్యక్తం చేసింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

