Ramarao On Duty Movie | ‘రామారావు ఆన్ డ్యూటీ’ లేటెస్ట్ అప్డేట్..!
Ramarao On Duty Latest Update | కెరీర్లో ఎప్పుడూ లేనంత స్పీడ్‌గా రవితేజ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఏడాదికి రెండు, మూడు సినిమాలను విడుదల చేసే విధంగా మాస్‌రాజా ప్లాన్ చేస్తున్నాడు. ప్రతి వారం ఏదో ఒక అప్డేట్తో రవితేజ.. అభిమానులను ఖుషి చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘రామారావు ఆన్ డ్యూటీ’ఒకటి. శరత్‌మండవ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూలై 29న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం వరుస అప్డేట్లను ఇస్తుంది. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ను ప్రకటించారు.
‘కింగ్ ఆఫ్ ది క్రౌడ్’ అంటూ సాగే ఈ సినిమా టైటిల్ సాంగ్‌ను జూలై 22న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో చిందర వందరగా పడిఉన్న ఫైల్స్ మధ్యలో నిల్చుని రవితేజ ఇంటెన్సీవ్‌గా చూస్తున్నాడు. ఈయన నీడ చెస్‌లోని కింగ్ సింబల్‌ను సూచిస్తుంది. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన ‘బుల్ బుల్ తరంగ్’, ‘సొట్ట బుగ్గల’, నా పేరు సీసా సాంగ్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. రవితేజకు జోడీగా ఈ చిత్రంలో దివ్యాంక కౌశిక్, రాజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. చాలా కాలం తర్వాత సీనియర్ నటుడు వేణు తోట్టెంపూడి ఈ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీ లక్ష్మివెంకటేశ్వరా సినిమాస్, ఆర్టి టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరితో కలిసి రవితేజ స్వీయ నిర్మాణంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంలో రవితేజ డిప్యూటీ కలెక్టర్‌గా కనిపించబోతున్నాడు.
#KingOfTheCrowd 👑 – An English song to depict the Mass and Magnanimity of RamaRao 🔥#RamaRaoOnDuty Title Song on July 22 🎧❤️🔥#RamaRaoOnDutyOnJuly29
Sung by @LavitaLobo 🎤
Lyrics by @directorsarat ❤️🔥
A @SamCSmusic Musical 🎶Mass Maharaja @RaviTeja_offl @LahariMusic pic.twitter.com/M0sgFBgd8u
— RT Team Works (@RTTeamWorks) July 20, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

