Rashmika | ప్రపంచవ్యాప్తంగా ‘సిబ్లింగ్స్ డే’ జరుపుకుంటున్న వేళ నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ మధురమైన జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన చిన్నారి సోదరి శిమన్ మందన్నతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అందమైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. గ్లామర్ ప్రపంచంలో ఎంత బిజీగా ఉన్నా కుటుంబ బంధాలను ఎంతగా విలువైనవిగా భావిస్తారో ఈ పోస్ట్ ద్వారా మరోసారి స్పష్టమైంది.ఈ ఫోటోలో రష్మికతో కలిసి కనిపించిన శిమన్ అందం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె కూడా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం శిమన్ వయసు కేవలం 14 ఏళ్లు మాత్రమే. రష్మికకి తనకి దాదాపు 16 ఏళ్ల వయస్సు తేడా ఉంది. ప్రస్తుతం ఆమె విద్యాభ్యాసంపైనే దృష్టి సారిస్తోంది.
శిమన్ భవిష్యత్తులో సినీ రంగంలోకి వస్తుందా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. అయితే ఆమెకు ఆసక్తి ఉంటే ఇండస్ట్రీ నుంచి మంచి అవకాశాలు రావడం ఖాయం అని అభిమానులు భావిస్తున్నారు. ఇక రష్మిక వ్యక్తిగత జీవితానికి వస్తే, ఇటీవల ఆమె నటుడు విజయ్ దేవరకొండతో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం అనంతరం వచ్చిన తొలి పుట్టినరోజు సందర్భంగా విజయ్ షేర్ చేసిన ప్రత్యేక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీరిద్దరూ కలిసి నటిస్తున్న రణబలి సినిమా బిహైండ్ ద సీన్స్ వీడియోను పంచుకుంటూ రష్మికకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆ వీడియోలో రష్మిక ‘జయమ్మ’ అనే వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం ఆమె చేస్తున్న కృషి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.మరోవైపు బాలీవుడ్లో కూడా రష్మిక కెరీర్ వేగంగా దూసుకుపోతోంది. నిర్మాత దినేష్ విజన్ నిర్మిస్తున్న కాక్టెయిల్ 2లో కృతి సనోన్‌తో కలిసి నటిస్తోంది. 2012లో వచ్చిన ‘కాక్టెయిల్’ సినిమాకు ఇది సీక్వెల్ కావడం విశేషం. ఈ చిత్రం జూన్ 19న విడుదల కానుంది. ఇప్పటికే ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక, ‘కాక్టెయిల్ 2’తో బాలీవుడ్ మార్కెట్‌ను మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.