కొత్త సినిమా సంబురం

కన్నడ సోయగం రష్మిక మందన్న వరుస చిత్రీకరణలతో తీరికలేకుండా గడుపుతోంది. ఇటీవలే బాలీవుడ్లో ‘గుడ్‌బై’ సినిమా షూటింగ్‌ను పూర్తిచేసుకొని హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’ చిత్రీకరణలో పాల్గొంటున్నది. తెలుగులో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటిస్తున్న మరో చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ రెగ్యులర్ షూటింగ్ సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. తాను ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫొటోల్ని అభిమానులతో పంచుకుంది. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. కుటుంబ కథా చిత్రంగా వినోదానికి పెద్దపీట వేస్తూ రూపొందించబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

