Sonam Kapoor | సోనమ్ కపూర్ పెట్టిన పోస్టు రానా దగ్గుబాటి గురించేనా? వాళ్ల మధ్య అసలు వైరమేంటి?
Sonam Kapoor | బాలీవుడ్ కథానాయిక సోనమ్‌కపూర్ తాజాగా సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఓ సందేశం హాట్‌టాపిక్‌గా మారింది. సోషల్‌మీడియాలో ఎంతో చురుకుగా వుండే సోనమ్‌కపూర్, తన చిత్ర విశేషాలు, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటారు. తాజాగా ఆమె సామాజిక వేత్త ఎలియనోర్ రూజ్వెల్ట్కు సంబంధించిన ఓ కోట్‌ను షేర్ చేశారు. “చిన్నబుద్ది కలిగిన వారు ఎదుటివ్యక్తుల గురించి మాట్లాడతారు.
Sonam Kapoor | బాలీవుడ్ కథానాయిక సోనమ్‌కపూర్ తాజాగా సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ చేసిన ఓ సందేశం హాట్‌టాపిక్‌గా మారింది. సోషల్‌మీడియాలో ఎంతో చురుకుగా వుండే సోనమ్‌కపూర్, తన చిత్ర విశేషాలు, వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటారు. తాజాగా ఆమె సామాజిక వేత్త ఎలియనోర్ రూజ్వెల్ట్కు సంబంధించిన ఓ కోట్‌ను షేర్ చేశారు. “చిన్నబుద్ది కలిగిన వారు ఎదుటివ్యక్తుల గురించి మాట్లాడతారు. ఓ మాదిరిగా ఆలోచించేవారు పరిస్థితుల గురించి మాట్లాడతారు. గొప్ప మనసు కలిగిన వారు ఆలోచనల గురించి చర్చిస్తుంటారు.
ఇది చిన్న విషయమే అయినప్పటికీ కొంత మంది దీనిని తెలుసుకోవాలనుకుంటున్నా. ముఖ్యంగా ఎదుటివారిపై వచ్చిన రూమర్స్ గురించి మాట్లాడేప్పుడు దీన్ని గుర్తుంచుకోవాలని అనుకుంటున్నా’ అంటూ పోస్ట్ చేశారు ఆమె. దీనిని చూసిన నెటిజన్లు సోనమ్ ఇలా ఎందుకు పోస్ట్ చేసింది అంటూ చర్చించుకుంటున్నారు. ఇటీవల జరిగిన ‘కింగ్ ఆఫ్ కోధ్రా’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రానా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా సోనమ్ ఇలా పోస్ట్ చేసిందని అంటున్నారు.
‘గతంలో దుల్కర్ నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఓ బీటౌన్ స్టార్ హీరోయిన్ షూట్ మధ్యలో తన భర్తతో ఫోన్లో షాపింగ్ గురించి మాట్లాడిందని… ఆమె కోసం దుల్కర్ వెయిట్ చేస్తున్న పట్టించుకోలేదని, ఆమె ఆ పరిస్థితిలో సరిగ్గా యాక్ట్ చేయకపోతే దుల్కర్ ఆమె కోసం మరోసారి ఆ సీన్స్‌లో యాక్ట్ చేయడానికి ముందుకు వచ్చారని’ రానా ఇటీవల ఆ ఫంక్షన్లో అన్నాడు. ఈ వ్యాఖ్యలపై మరుసటి రోజు రానా తన క్షమాపణలు కూడా చెప్పారు. ఈ క్రమంలోనే సోనమ్ ఈ పోస్ట్ పెట్టడంతో ఈ టాపిక్ వైరల్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Houthis | మేం మక్కా, మదీనాపై దాడి చేశామనడం అబద్ధం.. సౌదీ చమురుక్షేత్రాలే మా లక్ష్యం : హౌతీస్
EU Mahadharna | EU మహా ధర్నాకు ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కమిటీ మద్దతు
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి సూపర్ హిట్ మూవీ ‘బత్తా’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Cult Fans Meet | విజయ్ దేవరకొండ, నాని బాటలో విశ్వక్ సేన్.. ‘కల్ట్’ కోసం ఫ్యాన్స్ మీట్!
Dancing | ఉత్సవాల సమయంలో గంటల తరబడి నృత్యం చేయొద్దు.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

