హైదరాబాద్: టీవీ స్టార్ దీపిక చికిలియా(Dipika Chikhlia) .. 1987లో ప్రసారం అయిన రామాయణ్ సీరియల్లో సీత పాత్రను పోషించిన విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా ప్రస్తుతం రిలీజైన ఆదిపురుష్ చిత్రంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో.. ఆ నాటి నటి దీపిక తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను రిలీజ్ చేసింది. సీత డ్రెస్సు వేసుకున్న ఆమె.. ఆదిపురుష్ చిత్రంలోని రామ్ సియా రామ్ పాటకు ఫోజులు ఇచ్చింది. పబ్లిక్ డిమాండ్ ప్రకారమే ఈ పోస్టు పెట్టినట్లు దీపిక కామెంట్ పోస్టులో పేర్కొన్నది. సీత పాత్రను పోషించిన తనకు ఇంకా ఏమీ అవసరం లేదని ఆమె అన్నారు.
దీపిక చికిలియా చేసిన ఇన్స్టా పోస్టుపై ఆమె అభిమానులు స్పందిస్తున్నారు. ఆదిపురుష్ మ్యూజిక్ డైరెక్టర్ నమస్కారం చేసిన ఎమోజీని పోస్టు చేశారు. సీత పాత్రలో మిమ్మల్ని ఎవరూ మించిపోరు అని మరొకరు పోస్టు చేశారు. ఇది 600 కోట్ల సార్లు బెటర్ అన్నారు.