జోష్ తెచ్చే మాస్ పాట
హీరో రవితేజ నటిస్తున్న సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ నాయికలుగా నటిస్తున్నారు. యథార్థ ఘటనల నేపథ్యంతో యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు శరత్ మండవ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆయనకిది తొలి సినిమా. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, ఆర్టీ టీమ్ వర్క్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్నది. జూలై 29న విడుదల చేయబోతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి మూడో లిరికల్ సాంగ్ ‘నా పేరు సీసా..’ రిలీజ్ చేశారు. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్ని అందించగా సామ్ సీఎస్ స్వరపర్చి శ్రేయా ఘోషల్తో కలిసి పాడారు. ఈ పాటలో రవితేజతో కలిసి స్టెప్పులేసింది అన్వేషి. ఈ మాస్ పాటతో ప్రేక్షకులకు ఫుల్ జోష్ ఖాయమని చిత్ర బృందం చెబుతున్నారు. వేణు తొట్టెంపూడి, నాజర్, నరేష్ వీకే తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

