Ramabanam Movie | రామబాణం మూవీ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!
Ramabanam Movie Latest Update | మ్యాచో స్టార్ గోపిచంద్ హిట్టు చూసి తొమ్మిదేళ్లయింది. ‘లౌక్యం’ తర్వాత ఇప్పటివరకు గోపిచంద్‌కు హిట్టే లేదు. మధ్యలో ‘జిల్’, ‘గౌతమ్ నందా’, ‘సీటిమార్’ వంటి సినిమాలు బాగానే ఆడినా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయాయి.
Ramabanam Movie Latest Update | మ్యాచో స్టార్ గోపిచంద్ హిట్టు చూసి తొమ్మిదేళ్లయింది. ‘లౌక్యం’ తర్వాత ఇప్పటివరకు గోపిచంద్‌కు హిట్టే లేదు. మధ్యలో ‘జిల్’, ‘గౌతమ్ నందా’, ‘సీటిమార్’ వంటి సినిమాలు బాగానే ఆడినా.. కమర్షియల్‌గా సేఫ్ కాలేకపోయాయి. ఇక గతేడాది భారీ అంచనాల మధ్య రిలీజైన ‘పక్కా కమర్షియల్’ పబ్లిసిటీ ఖర్చులను కూడా వెనక్కు తీసుకురాలేకపోయింది. దాంతో ప్రస్తుతం ఆయన ఆశలన్నీ రామబాణం సినిమాపైనే ఉన్నాయి. శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లతో సినిమాపై మంచి హైప్ తీసుకొస్తున్నారు.
కాగా నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో గ్రాండ్‌గా జరుగనుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో గోపిచంద్‌కు జోడీగా డింపుల్ హయతి నటిస్తుంది. జగతిబాబు, ఖుష్భూ కీలకపాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక అటు గోపిచంద్‌కు, ఇటు శ్రీవాస్‌కు ఇద్దరికి హిట్టు చాలా అవసరం. శ్రీవాస్ కూడా గతకొంత కాలంగా లైమ్‌లైట్‌లో లేడు. లౌక్యం తర్వాత ఆయన తెరకెక్కించిన డిక్టేటర్, సాక్ష్యం డిజాస్టర్లుగా మిగిలాయి. మరీ ఈ సినిమాతో అయినా వీరిద్దరూ గట్టెక్కుతారో లేదో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

