Skanda Trailer | రామ్ పోతినేని, బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం స్కంద. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మాస్ కా బాప్ రేంజ్లో హీరోలను ఎలివేట్ చేసే బోయపాటి.. లవర్‌బోయ్ రామ్‌ను ఎలా చూపిస్తాడని అంతా అనుకున్నారు. ఈ క్రమంలో వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ బీభత్సంగా ఎక్స్‌పక్టేషన్స్ పెంచాయి. దీంతో స్కంద మూవీ ఎలా ఉండబోతుందో చూడాలని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ ఎదురుచూపులకు మరింత హైప్ ఇస్తూ చిత్ర బృందం ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో రామ్ రెండు కోణాల్లో కనిపించారు.
దెబ్బ తాకితే సౌండ్ గోల్కొడ దాటాల; నీకు నిద్రపోయేవాళ్లను చంపడం అలవాటేమో.. నాకు నిద్రలేపి చంపడం అలవాటు అంటూ రామ్ పోతినేని చెప్పిన పంచ్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. రామ్ పోతినేనిపై చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్‌లు గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. శ్రీలీల – రామ్ మధ్య సీన్స్ కూడా క్యూట్‌గా ఉన్నాయి. థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే బాక్స్‌లు బద్ధలు కావడం పక్కా అనిపించేలా ఉంది.
“Sreeleela | హాఫ్ శారీలో హార్ట్ బీట్‌ను పెంచేస్తున్న శ్రీలీల..”