‘పెద్ది’ కథలో అదే కీలకం!
రామ్‌చరణ్ ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా ప్రమోషన్స్‌కు శ్రీకారం చుడుతూ ఈ నెల 18న ముంబయిలో ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు, ఆపై 23వ తేదీన భోపాల్‌లో కూడా భారీ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు బుధవారం మేకర్స్ తెలిపారు.
రామ్‌చరణ్ ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా ప్రమోషన్స్‌కు శ్రీకారం చుడుతూ ఈ నెల 18న ముంబయిలో ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు, ఆపై 23వ తేదీన భోపాల్‌లో కూడా భారీ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నట్లు బుధవారం మేకర్స్ తెలిపారు. ఇదిలా ఉండగా ‘పెద్ది’ కథలోని కీలకాంశాల గురించి ఆసక్తికరమైన విషయాలు బయటికొస్తున్నాయి. ట్రైలర్ విడుదలకు ముందే మెగాభిమానులు ఈ సినిమాలోని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఇవేనంటూ చర్చించుకుంటున్నారు. గ్రామీణ క్రీడా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్ ఆటకూలీగా కనిపించనున్నారు.
క్రికెట్, కుస్తీపోటీల నేపథ్యంలో కథ సాగుతుందని చెబుతున్నారు. అయితే ఈ కథలో ‘పెద్ది’ గ్రామానికి సంబంధించిన ఓ ఎమోషనల్ పాయింట్ కీలకంగా ఉంటుందట. తన ఊరి శ్రేయస్సు కోసం పెద్ది ఏం చేశాడు? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడనేది కథలో ప్రధానాంశమని అంటున్నారు. ‘పెద్ది’ తండ్రిగా జగపతిబాబు, కోచ్‌గా శివరాజ్‌కుమార్ పాత్రలు కథాగమనంలో అత్యంత కీలకంగా ఉంటాయట. ట్రైలర్లో ఇందుకు సంబంధించిన విషయాల్ని కూడా వెల్లడిస్తారని అంటున్నారు. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్.రెహమాన్. బుచ్చిబాబు సానా దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

