Ram Charan | టాలీవుడ్ డ్యాన్సర్లకు రామ్ చరణ్ భరోసా.. 500 కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్!
RamCharan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఉదారతను మరోసారి చాటుకున్నారు.
Mega Power Star | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు చెందిన సుమారు 500 మంది సభ్యులు మరియు వారి కుటుంబాలకు ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే బాధ్యతను ఆయన స్వీకరించారు. గతంలో తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, ఈ హెల్త్ కార్డుల పంపిణీకి సంబంధించిన ప్రతిపాదనను రామ్ చరణ్ తాజాగా ఆమోదించినట్లు తెలుస్తుంది. ఈ పథకం ద్వారా ప్రతి డ్యాన్సర్ కుటుంబానికి సమగ్ర ఆరోగ్య బీమా లభించనుంది, దీని కోసం రామ్ చరణ్ సుమారు రూ.50 లక్షల వరకు వెచ్చిస్తున్నట్లు సమాచారం.
సినీ షూటింగ్లలో ఎంతో రిస్క్ తీసుకుని పనిచేసే డ్యాన్సర్లు ప్రమాదాలకు గురైనప్పుడు లేదా అనారోగ్యం బారిన పడినప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో చరణ్ ఈ ముందడుగు వేశారు. తన భార్య ఉపాసన కొణిదెలతో కలిసి ఈ సేవా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న ఆయన, మెగాస్టార్ చిరంజీవి బాటలోనే సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. ప్రస్తుతం ‘పెద్ది’ వంటి భారీ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, తనను నమ్ముకున్న సినీ కార్మికుల భద్రత కోసం ఇంత పెద్ద మొత్తాన్ని కేటాయించడంపై డ్యాన్సర్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. చరణ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 500కు పైగా కుటుంబాలకు వైద్యపరమైన భరోసా లభించిందని, ఆయన రియల్ లైఫ్ హీరో అని పరిశ్రమ వర్గాలు కొనియాడుతున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power cuts | కరెంటు కోతలను నిరసిస్తూ నార్సింగి సబ్‌స్టేషన్ ఎదుట రైతుల ధర్నా
AICWA | తనుశ్రీ దత్తా వ్యాఖ్యలపై ఏఐసీడబ్ల్యూఏ ఆగ్రహం.. ‘ఈవిల్ డెడ్’ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సినీ సంఘం!
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

