Ram Charan | గేమ్ ఛేంజర్‌లో రామ్నందన్గా రామ్‌చరణ్.. అభిమానులకు కన్నులపండుగగా క్లైమాక్స్
వంద సినిమాల్లో వంద పాత్రలు పోషించినా.. గుర్తుండిపోయే పాత్రలు మాత్రం అయిదారులోపే ఉంటాయి. చిన్న హీరోల విషయంలోనే కాదు, పెద్ద పెద్ద సూపర్స్టార్ల విషయంలోనూ ఇదే పరిస్థితి.
Ram Charan | వంద సినిమాల్లో వంద పాత్రలు పోషించినా.. గుర్తుండిపోయే పాత్రలు మాత్రం అయిదారులోపే ఉంటాయి. చిన్న హీరోల విషయంలోనే కాదు, పెద్ద పెద్ద సూపర్స్టార్ల విషయంలోనూ ఇదే పరిస్థితి. అయితే, అరుదుగా దొరికే పాత్రల్ని అద్భుతంగా పోషించడంలోనే ఉంటుంది అసలైన ప్రతిభ. అవి సదరు నటుడ్ని చిరస్థాయిగా జనహృదయాల్లో నిలిచేలా చేస్తాయి.
ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’లో రామ్‌చరణ్ చేస్తున్న పాత్ర కూడా దాదాపు అలాంటిదే. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రెండూ పొంతన లేని పాత్రలు. అందులో ఒక పాత్ర నేటి యువతరానికి ప్రతీకగా నిలిచేదైతే.. మరో పాత్ర 70, 80ల్లో పాత్ర. రెండు పాత్రల ఆహార్యాలు కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇందులో రామ్‌చరణ్ పోషిస్తున్న పాత్ర పేరు ‘రామ్ నందన్’ అని తెలుస్తున్నది.
విభిన్న కోణాల్లో భావోద్వేగపూరితంగా ఈ పాత్ర సాగుతుందని తెలుస్తున్నది. అలాగే పతాక సన్నివేశం అభిమానులకు కనులపండుగగా ఉంటుందని సమాచారం. ‘ఒకేఒక్కడు’ స్థాయి కథ, కథనాలతో దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం.
రాజకీయ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ మూవీలో పీరియాడికల్ నేపథ్యంలోపాటు, ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం, ప్రతీకారం, సామాజిక సమస్యలు.. అన్నీ మిళితమై ఉంటాయని వినికిడి. కైరా అద్వాణీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, శ్రీకాంత్, ఎస్.ఎ.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.జె.తమన్, మాటలు: సాయిమాధవ్ బుర్రా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నల వర్షం
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
Anirudh-Kavya | అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి సందడి షురూ.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, చెన్నై రిసెప్షన్
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

