Aha Naa Pellanta | ఫన్, ఎంటర్టైనింగ్గా రాజ్‌తరణ్ ‘ఆహా నా పెళ్లంట’ టీజర్..!
Aha Naa Pellanta Trailer | కెరీర్ బిగెనింగ్‌లోనే హాట్రిక్ విజయాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు యువ హీరో రాజ్ తరుణ్. ఆయితే అదే జోష్న తదుపరి సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. 'ఉయ్యాలజంపాల', 'సినిమా చూపిస్త మామ', 'కుమారి 21ఎఫ్' వంటి వరుస బ్లాక్బస్టర్ల తర్వాత ఇప్పటివరకు ఈయనకు మరో హిట్ లేదు.
Aha Naa Pellanta Trailer | కెరీర్ బిగెనింగ్‌లోనే హాట్రిక్ విజయాలు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు యువ హీరో రాజ్ తరుణ్. ఆయితే అదే జోష్న తదుపరి సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. ‘ఉయ్యాలజంపాల’, ‘సినిమా చూపిస్త మామ’, ‘కుమారి 21ఎఫ్’ వంటి వరుస బ్లాక్బస్టర్ల తర్వాత ఇప్పటివరకు ఈయనకు మరో హిట్ లేదు. డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేస్తున్నా.. రాజ్‌తరుణ్‌కు మాత్రం హిట్టు వరించడం లేదు. ఇటీవలే భారీ అంచనాలతో రిలీజైన ‘స్టాండప్ రాహుల్’ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ క్రమంలో రాజ్ తరుణ్ ప్రస్తుతం ఓటీటీని నమ్ముకున్నాడు.
రాజ్‌తరుణ్ తాజాగా ఓటీటీ ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఈయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఆహా నా పెళ్లంట’ వెబ్‌సిరీస్ ‘జీ-5’లో నవంబర్ 17నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. హీరో చిన్నప్పుటి నుండి ఏ అమ్మాయిని చూడకూడదు అని తల్లి ఒట్టు వేయించుకుంటుంది. అయితే విచిత్రంగా హీరో అమ్మాయిలను చూసిన ప్రతీ సారీ ఏదొక ఇన్సిడెంట్ జరుగుతుంది. దీంతో అతను అమ్మాయిల వైపు చూడటమే మానేస్తాడు. చివరకు పెళ్లి చేసుకుంటాను సంబంధాలు చూడమని హీరో ఇంట్లో చెప్తే.. తీరా పెళ్లి ఫిక్స్ అయ్యాక తన లైఫ్ లోకి ఇంకో అమ్మాయి వస్తుంది. ఆ తర్వాత హీరో లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది అనే కాన్సెప్ట్‌తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తుంది.
ఈ వెబ్‌సిరీస్‌లో రాజ్‌తరుణ్‌కు జోడీగా శివాణీ రాజశేఖర్ హీరోయిన్గా నటించింది. టీజర్‌తోనే చిత్రబృందం వెబ్ సిరీస్‌పై మంచి అంచనాలు నెలకొల్పింది. జీ-5తో కలిసి తమాడా మీడియా సంస్థ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ ఎనిమిది ఎపిసోడ్లుగా రూపొందింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

