Rajkummar Rao | తండ్రి కాబోతున్న రాజ్‌కుమార్ రావు.. సోషల్ మీడియాలో పోస్ట్
Rajkummar Rao - Patralekhaa | బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు, పత్రలేఖ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు.
Rajkummar Rao – Patralekhaa| బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు, పత్రలేఖ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తను ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు నటుడు. అయితే తాను తండ్రి కావడం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని తెలిపాడు రాజ్‌కుమార్ రావు.
తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌కుమార్ రావు మాట్లాడుతూ.. నేను గొప్ప తండ్రిని అవుతాను. ఎందుకంటే నేను మంచి భర్తను కాబట్టి. తమ స్నేహితుల్లో చాలా మంది తల్లిదండ్రులుగా మారిన తర్వాత జీవితంలో ఇదే అత్యుత్తమ దశ అని చెబుతున్నారు. మేము కూడా ఆ క్షణం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం. మేము తల్లిదండ్రులు అవ్వబోతున్నాం అనేది ఇంకా నమ్మశక్యంగా అనిపించడం లేదని, ప్రతిరోజూ కొత్తగానే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాజ్‌కుమార్ రావు, పత్రలేఖ దాదాపు 15 సంవత్సరాలుగా కలిసి ఉన్నారు. 2021 నవంబర్‌లో ఈ జంట వివాహం చేసుకుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

