Cinema News | కళ్లు లేకుండా జీవితాన్ని గెలిచిన విజేత
దర్శకుడు తుషార్ హీరానందానీ ‘శ్రీకాంత్' కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఇలాంటి వ్యక్తి ఈ భూప్రపంచంలో ఉన్నాడా?! అనిపించింది.
Cinema News | ‘దర్శకుడు తుషార్ హీరానందానీ ‘శ్రీకాంత్’ కథ చెప్పినప్పుడు షాక్ అయ్యాను. ఇలాంటి వ్యక్తి ఈ భూప్రపంచంలో ఉన్నాడా?! అనిపించింది.’ అన్నారు జ్యోతిక. కళ్లు లేని దివ్యాంగుడైన తెలుగు పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా బయోపిక్‌గా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం ‘శ్రీకాంత్’. ఇందులో శ్రీకాంత్‌గా రాజ్‌కుమార్‌రావ్ నటించగా, జ్యోతిక కథలో కీలకమైన పాత్ర పోషించారు. తుషార్ హిరానందానీ దర్శకుడు. భూషణ్‌కుమార్, కిషన్‌కుమార్, నిధి పర్మార్, హీరానందాని నిర్మాతలు. ఈ నెల 10న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్‌లో జ్యోతిక విలేకరులతో ముచ్చటించారు.
సర్వేద్రియాణాం నయనం ప్రధానం అన్నారు. కళ్లు లేకుండా జీవితాన్ని గెలవడం చిన్న విషయం కాదు. అందుకే అలాంటి గొప్ప వ్యక్తి కథలో నటించడం గౌరవంగా భావించాను. శ్రీకాంత్ బొల్లాగా రాజ్‌కుమార్‌రావు నటన అద్భుతంగా ఉంటుంది. కళ్లు లేని దివ్యాంగుడిలా నెక్ట్స్ లెవల్లో నటించారాయన.శ్రీకాంత్ బొల్లా కథలో చాలా కోణాలున్నాయి. ఆయన జీవితాన్ని ప్రభావితం చేసిన స్త్రీమూర్తులు చాలామంది ఉన్నారు. వారందరినీ కలిపి ఓ కేరక్టర్‌ని క్రియేట్ చేశారు దర్శకుడు తుషార్. నా పాత్ర అదే. ఈ సినిమాలో ఉపాధ్యాయురాలిగా కనిపిస్తా. శ్రీకాంత్‌ని ప్రభావితం చేసే పాత్ర అన్నమాట. మంచితనం, సామాజిక స్పృహ కలగలిసిన గొప్ప పాత్ర. విశేషమేంటంటే నేను టీచర్‌గా నటించిన మూడో సినిమా ఇది.ప్రస్తుతానికి ఈ సినిమాతోపాటు ఒక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను. కాస్త ఖాళీ దొరికితే పిల్లలతో సరిపోతుంది. సూర్య కూడా తన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తెలుగులో నటించి చాలాకాలం అయ్యింది. మంచి పాత్ర లభిస్తే తెలుగులో కూడా చేస్తాను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

