Lal Salaam | రజినీకాంత్ ‘లాల్ సలామ్’ సినిమాకు ఎదురుదెబ్బ.. ఆ దేశాల్లో బ్యాన్..?
Lal Salaam | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. వీటిలో ఒకటి లాల్‌సలామ్ (Lal Salaam). రజినీ కూతురు ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది. విష్ణువిశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
Lal Salaam | తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. వీటిలో ఒకటి లాల్‌సలామ్ (Lal Salaam). రజినీ కూతురు ఐశ్వర్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది. విష్ణువిశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌తో పాటు ఫస్ట్ సింగిల్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 09 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లతో సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేస్తున్నారు. అయితే అంతా ఒకే అనుకుంటున్న సమయంలో లాల్ సలామ్ సినిమాకు ఒక బిగ్ షాక్ తగిలింది.
ఈ సినిమా ఓవర్సీస్లో గ్రాండ్‌గా విడుదల అవుతున్న విషయం తెలిసిందే.. అయితే తాజాగా కువైట్, ఖతార్ వంటి అరబ్ దేశాల్లో ఈ సినిమా బ్యాన్ చేసినట్లు సమాచారం. మతపరమైన అంశాలు ఈ సినిమాలో ఉండడంతో మూవీని బ్యాన్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం అన్నది క్లారిటీ లేదు. ఇక రీసెంట్గా ఫైటర్ సినిమా కూడా గల్ఫ్‌లో బ్యాన్ చేశారు. దాని వల్ల ఫైటర్‌కు కొంత మేర నష్టం అయితే వాటిల్లింది.
లైకా ప్రోడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్, సెంథిల్, జీవిత, తంబి రామయ్య, అనంతిక సనీల్‌కుమార్, వివేక్ ప్రసన్న, మరియు తంగదురై ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

