‘జైలర్’ చిత్రంతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు అగ్ర హీరో రజనీకాంత్. ఆయన తదుపరి చిత్రానికి ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 19న సెట్స్‌మీదకు వెళ్లనుంది. వాణిజ్య హంగులు కలబోసిన సామాజిక కథాంశంతో తెరకెక్కించబోతున్నారని సమాచారం. ఇందులో రజనీకాంత్ పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతున్నది. ఇదిలావుండగా ఈ సినిమాలో తెలుగు యువ హీరోలు నాని లేదా శర్వానంద్ కీలక పాత్రలో నటించనున్నారని వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం వారిద్దరి స్థానంలో ఈ అవకాశాన్ని రానా దక్కించుకున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్లో రానా జాయిన్ కాబోతున్నాడని సమాచారం. అయితే ఆయన పాత్ర ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. రజనీకాంత్ 170 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్నది.