Rajinikanth | సూపర్‌స్టార్ రజనీకాంత్ వేట్టయాన్కి వేళ కాలేదట
కేరళలోని ఓ పెళ్లికి హాజరై తిరిగి చెన్నై బయలుదేరిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌ని తిరువనంతపురం విమానాశ్రయంలో మీడియా చుట్టుముట్టింది. ఫ్లైట్‌కి సమయం ఉండటంతో మీడియా ప్రశ్నలకు తీరిగ్గా సమాధానాలిచ్చారు తలైవా.
Rajinikanth | కేరళలోని ఓ పెళ్లికి హాజరై తిరిగి చెన్నై బయలుదేరిన సూపర్‌స్టార్ రజనీకాంత్‌ని తిరువనంతపురం విమానాశ్రయంలో మీడియా చుట్టుముట్టింది. ఫ్లైట్‌కి సమయం ఉండటంతో మీడియా ప్రశ్నలకు తీరిగ్గా సమాధానాలిచ్చారు తలైవా. కమల్‌హాసన్ ‘భారతీయుడు2’ సినిమా గురించి ప్రశ్నించగా, ‘బాగుంది.. నాకైతే నచ్చింది..’ అంటూ సింపుల్‌గా నవ్వుతూ సమాధానమిచ్చారు రజనీ. తన సినిమాల గురించి మాట్లాడుతూ – ‘ ‘వేట్టయాన్’ రిలీజ్ డేట్ ఖరారు కాలేదు. ప్రస్తుతమైతే డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి.
ఇక ‘కూలీ’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది.’ అని తెలిపారు. ఇదిలావుంటే.. ‘వేట్టయాన్’ సినిమాకు సంబంధించి తన వర్క్ మొత్తం పూర్తయిందనీ, సినిమాను దసరాకు విడుదల చేసే అవకాశం ఉందని ఇటీవల రజనీ చెప్పారు. ఇప్పుడు మాత్రం డేట్ ఖరారు కాలేదని ఆయనే చెప్పారు. మొన్నామధ్య సూర్య ‘కంగువ’ నిర్మాత ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్ ‘వేట్టయాన్’ వాయిదా పడిందని, అందుకే ‘కంగువ’ను దసరాకు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో రజనీ చెప్పిన సమాధానం, ‘కంగువ’ నిర్మాత చెప్పినదానికి బలాన్నిచ్చినట్టయ్యింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

