Rajinikanth 173 | రజనీకాంత్ 173వ సినిమాకి దర్శకుడు ఫిక్స్.. అధికారిక ప్రకటన కోసం వెయిటింగ్
Rajinikanth 173 | సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ‘జైలర్’ సక్సెస్‌తో భారీ క్రేజ్ సంపాదించిన ఈ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Rajinikanth 173 | సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ 2పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ‘జైలర్’ సక్సెస్‌తో భారీ క్రేజ్ సంపాదించిన ఈ ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ‘జైలర్ 2’ పూర్తి చేసిన తర్వాత రజనీకాంత్ మరో రెండు భారీ ప్రాజెక్ట్‌లను ప్రారంభించాలనుకుంటున్నారు. ముఖ్యంగా కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందనున్న భారీ యాక్షన్ డ్రామా పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ప్రాజెక్ట్‌కు మొదటగా దర్శకుడిగా సుందర్ సిను ఎంపిక చేశారు. అయితే అధికారిక ప్రకటన వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆయన వ్యక్తిగత కారణాలతో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడంతో పెద్ద షాక్ తగిలింది.
దీంతో రజనీ 173వ చిత్రానికి దర్శకుడు ఎవరు అన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో శిబి చక్రవర్తి పేరు ముందుకు వచ్చింది. ఆయన దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని ప్రచారం జరిగింది. ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయని, రజనీకాంత్ కోసం 80కి పైగా గెటప్స్ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారాయి. ‘డ్రాగన్’ ఫేమ్ అశ్వత్ మారిముత్తు ఈ ప్రాజెక్ట్‌లోకి ప్రవేశించినట్టు ప్రచారం జరిగింది. అయితే ఫైనల్‌గా శిబి చక్రవర్తినే ఈ ప్రాజెక్ట్‌కి దర్శకుడిగా ఫిక్స్ అయ్యాడని త్వరలోనే దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన ‘ధురంధర్’ తరహా మాస్ ఫార్ములాతో ఈ సినిమాను కొత్తగా తీర్చిదిద్దాలనే ఆలోచనలో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రాజెక్ట్ ప్రారంభం అయ్యే వరకు అసలు దర్శకుడు ఎవరు అన్నది ఇంకా క్లారిటీ రాకపోవడం అభిమానుల్లో గందరగోళం కలిగిస్తోంది. రజనీకాంత్ సినిమా తర్వాత శిబి తెలుగులో కూడా ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. రజనీకాంత్ సినిమాలంటే భారీ అంచనాలు ఉండటం సహజం. అలాంటి సమయంలో ఒకే ప్రాజెక్ట్ చుట్టూ ఇలా మారుతున్న పరిణామాలు అభిమానుల్లో అనుమానాలను పెంచుతున్నాయి. చివరికి ఈ ప్రాజెక్ట్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారు? ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది? అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bengaluru Techie’s Kidnap | టెక్కీ కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్.. అతడు అత్యాచారానికి పాల్పడినట్లు కిడ్నాపర్ మహిళ ఫిర్యాదు
Tirumala | తిరుమలలో నీటి ఎద్దడి రాకుండా పటిష్ట చర్యలు.. 150 రోజులకు సరిపడా నీటి నిల్వలు : టీటీడీ
Water Tanker | హైదరాబాద్ రోడ్లపై.. వాటర్ ట్యాంకర్లో నుంచి వృధాగా పోతున్న నీళ్లు.. వీడియో
Case Register | రైస్‌మిల్‌లో రూ.13.77 కోట్ల సీఎంఆర్ ధాన్యం మాయం.. మిల్లు భాగస్వాములపై కేసు నమోదు
Premayanam | ఓటీటీలో అదరగొడుతున్న ‘ప్రేమాయణం’ వెబ్ సిరీస్.. ఆకట్టుకుంటున్న బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

