Chilkur Balaji Priest | చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడిపై దాడి.. ఘటనపై రాజేంద్రనగర్ డీసీపీ కీలక ప్రకటన..!
Chilkur Balaji Priest | చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ దాడి ఘటనపై రాజేంద్రనగర్ డీసీపీ కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో ఈ ఉదయం ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని అరెస్టు చేశామన్నారు.
Chilkur Balaji Priest | చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ దాడి ఘటనపై రాజేంద్రనగర్ డీసీపీ కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో ఈ ఉదయం ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని అరెస్టు చేశామన్నారు. ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు చేసి తరలించినట్లు తెలిపారు. నిందితులు ఖమ్మం, నిజామాబాద్‌కు చెందిన వారుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. 2022లో వీరరాఘవరెడ్డి ‘రామరాజ్యం’ను ప్రారంభించాడని.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ప్రచారం చేశాడని చెప్పారు. రామరాజ్యంలో చేరితో రూ.20వేల జీతం ఇస్తానన్నానని ప్రచారం చేశాడని.. తణుకు, కోటప్పకొండలో వీరరాఘవరెడ్డి పర్యటించాడని.. రామరాజ్యంలో చేరిన వారిని యూనిఫామ్ కుట్టించుకోమన్నాడని వివరించారు.
ఈ నెల 6న అందరూ యాప్రాల్‌లో కలిశారని.. రామరాజ్యం బ్యానర్‌తో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారని.. ఫొటోలు, వీడియోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు తెలిపారు. ఈ నెల 7న చిలుకూరు వచ్చి రంగరాజన్‌పై దాడి చేశారని చెప్పారు. మూడు వాహనాల్లో వచ్చి రంగరాజన్‌పై దాడికి పాల్పడ్డారని.. రంగరాజన్‌పై దాడి కేసులో ఇప్పటి వరకు ఆరుగురు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా ఆరుగురు అరెస్ట్ చేశామన్నారు. ప్రధాన నిందితుడు మణికొండలో ఉంటున్నాడని.. వీరరాఘవరెడ్డి స్వస్థలం తూగో జిల్లా అనపర్తి మండలం కొప్పవరమని చెప్పారు. ఈ నెల 7న వీరరాఘవరెడ్డి అనుచరులతో వచ్చి దాడికి పాల్పడ్డాడని.. 25 మంది నల్ల దుస్తుల్లో వచ్చి రంగరాజన్‌పై దాడి చేసినట్లుగా వివరించారు. తమకు ఆర్థికంగా సాయం చేయాలని డిమాండ్ చేశారని, రామరాజ్యంలో సభ్యుల్ని చేర్పించాలని కోరారని.. డిమాండ్లకు అంగీకరించలేదన్న కారణంతో దాడికి పాల్పడ్డట్లుగా డీసీపీ వివరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఓటరు నమోదులో వేగం పెంచాలి… రేవంత్ రెడ్డిని గద్దె దించాలి’
‘పిల్లలపై లైంగిక నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి’
Harish Rao | చంద్రబాబు నాయుడు ఏపీకి కరువు లేకుండా చేశారు.. తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్ : హరీశ్ రావు
‘భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు’
‘ఎమ్మెల్సీ ఓటు నమోదుకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

