సినిమా మీద ప్రేమే బతికించింది
“శేఖర్’ చిత్రంలో సరికొత్త లుక్‌తో కనిస్తాను. నా కెరీర్లో తప్పకుండా ఓ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుంది’ అన్నారు సీనియర్ హీరో రాజశేఖర్. ఆయన టైటిల్ రోల్‌ని పోషించిన తాజా చిత్రం ‘శేఖర్’. మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్’ చిత్రానికి రీమేక్ ఇది. జీవిత రాజశేఖర్ దర్శకురాలు. నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం రాజశేఖర్ పాత్రికేయులతో సినిమా విశేషాల్ని పంచుకున్నారు..
‘శేఖర్’ నటుడిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. నా క్యారెక్టర్లో బలమైన భావోద్వేగాల్ని పండించే అవకాశం దొరికింది. ఈ సినిమాలో నేను 55 ఏళ్ల వయసున్న వ్యక్తి పాత్రలో కనిపిస్తా. కొత్త లుక్‌తో ఉంటేనే నా పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతారని భావించా. చివరకు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌తో సిద్ధమయ్యా. ఈ సినిమా చూసిన నా సన్నిహితులు చాలా మంది లుక్ సూపర్‌గా ఉందని మెచ్చుకున్నారు.
ఎమోషన్స్ మిస్ కాలేదు
ట్రైలర్‌కు వచ్చిన స్పందన చూసి సినిమా విజయంపై నమ్మకం పెరిగింది. సెన్సార్‌వారు కూడా సినిమాలో మంచి ఫీల్ ఉందని ప్రశంసించారు. మలయాళ మాతృకలోని భావోద్వేగాలు ఏమాత్రం మిస్ కాకుండా జీవిత సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దింది. ప్రతి సీన్లో ఎమోషన్ పండేలా చూసుకుంది. నేను నటించిన రీమేక్ సినిమాలన్నీ మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. అదే నమ్మకంతో ‘శేఖర్’ సినిమా కోసం కష్టపడ్డాను.
పునర్జమ్మ పొందాను
గత ఏడాది కరోనాతో విషమ పరిస్థితిని ఎదుర్కొన్నా. మరణం అంచుల వరకు వెళ్లొచ్చా. ఏ మాత్రం ఆశలేని పరిస్థితి నుంచి పునర్జన్మ పొందాను. ఐసీయూలో ఓ టీవీ ఉండేది. అందులో వస్తున్న సినిమాలు చూసి..నేనూ హీరోనే కదా..మళ్లీ ఎలాగైనా తెరపై కనిపించాలని ధైర్యాన్ని ప్రోది చేసుకున్నా. సినిమాపై ఉన్న ప్రేమ, ఆరాధన నన్ను బతికించాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

