రాజ్‌తరుణ్, అమృతచౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘టార్టాయిస్’. రిత్విక్ కుమార్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘విభిన్నమైన కథాంశమిది. హీరోకి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలో అతను ఓ అమ్మాయిని చంపేస్తాడు.
తర్వాత ఏం జరిగింది?’ అన్నది ఉత్కంఠను రేకెత్తిస్తుంది’ అని చెప్పారు. శ్రీనివాస్ అవసరాల, ధన్యబాలకృష్ణ, రవి కాలే, షిజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌రూబెన్స్, నిర్మాతలు: విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు, మధుపాల సురేష్, కథ, దర్శకత్వం: రిత్విక్ కుమార్.