Raaka | ‘రాకా’ క్రేజీ రూమర్.. నెగిటివ్ షేడ్స్‌లో కనిపించనున్న ఐశ్వర్య
Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్స్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ సినిమాలో నటి ఐశ్వర్య లక్ష్మి కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.తాజా సమాచారం ప్రకారం, ‘రాకా’లో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా కాకుండా విభిన్నమైన, ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆమె పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉంటాయని సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ఆమె పాత్ర ఎలా ఉంటుంది? అల్లు అర్జున్ పాత్రతో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? అనే విషయాలపై చిత్రబృందం ఇంకా ఎలాంటి అధికారిక వివరాలు వెల్లడించలేదు.
ప్రస్తుతం ముంబైలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా, త్వరలోనే ఐశ్వర్య లక్ష్మి కూడా షూటింగ్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. ఆమె పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ భారీ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు టాలెంటెడ్ నటి మృణాల్ ఠాకూర్, యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఒకే సినిమాలో పలువురు ప్రముఖ హీరోయిన్లు భాగం కావడం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. అయితే ఈ నటీనటుల పాత్రలపై చిత్రబృందం నుంచి పూర్తి స్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
‘రాకా’ కథ మాఫియా నేపథ్యంలో సాగుతుందని ప్రచారం జరుగుతోంది. ఓ పవర్ఫుల్ డాన్ చుట్టూ తిరిగే ఈ కథలో అల్లు అర్జున్ అత్యంత స్టైలిష్, మాస్ అవతార్‌లో కనిపించనున్నారని టాక్. ముఖ్యంగా అట్లీ సినిమాల ప్రత్యేకతగా నిలిచే భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయని తెలుస్తోంది. అల్లు అర్జున్ స్టార్డమ్కు తగ్గట్టుగా అట్లీ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిని దాటి అంతర్జాతీయ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా రూపొందిస్తున్నారని సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాల కోసం విదేశీ నిపుణులు, అంతర్జాతీయ టెక్నీషియన్స్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ కారణంగా సినిమాపై భారీ హైప్ నెలకొనగా, ఇప్పుడు స్టార్ హీరోయిన్ల జాబితా, ఐశ్వర్య లక్ష్మి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రపై వస్తున్న ప్రచారం మరింత ఆసక్తిని రేపుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

