Mysaa Movie | బర్త్డే స్పెషల్.. ‘మైసా’ నుంచి రష్మిక వైల్డ్ లుక్ పోస్టర్
Mysaa Movie | నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుట్టినరోజు (ఏప్రిల్ 5) సందర్భంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం 'మైసా' (Mysaa) నుంచి మేకర్స్ ఒక పవర్ఫుల్ అప్డేట్ ఇచ్చారు.
Mysaa Movie | నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుట్టినరోజు (ఏప్రిల్ 5) సందర్భంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘మైసా’ (Mysaa) నుంచి మేకర్స్ ఒక పవర్ఫుల్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా నుంచి రష్మికకు సంబంధించిన ఒక ఇంటెన్స్ అండ్ వైల్డ్ పోస్టర్ను చిత్ర బృందం విడుదల చేసింది. ‘ఆమె తన మనోహరమైన రూపంతో మనసులను దోచుకుంది… తన హుందాతనంతో అందరినీ గెలుచుకుంది… ఇప్పుడు ఆమె కేవలం రౌద్రంతో మన ముందుకు రాబోతోంది. ఎప్పటికీ అద్భుతంగా ఉండే రష్మికకు ‘మైసా’ టీమ్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు. థియేటర్లలో ఆమె రౌద్ర ప్రదర్శనను చూడటానికి సిద్ధంగా ఉండండంటూ’ చిత్రబృందం రాసుకోచ్చింది.
ఈ పోస్టర్లో రష్మిక మునుపెన్నడూ లేని విధంగా చాలా ‘రా అండ్ రస్టిక్’ లుక్లో కనిపిస్తోంది. ముఖంపై రక్తపు చారలు, గాయాలతో ఉన్నప్పటికీ.. ఆమె కళ్ళలో కనిపిస్తున్న పట్టుదల మరియు తీవ్రత ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో రష్మిక ఒక పవర్ఫుల్ గోండు తెగకు చెందిన మహిళగా నటిస్తున్నట్లు సమాచారం. ఇది ఒక ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో రవీంద్ర పుల్లె దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ 2026 లోనే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

