నాగార్జున మెచ్చుకున్నారు
‘ఇందులో హీరో మూగవాడు. ఈ తరహా పాత్రను తెలిసిన నటుడు చేస్తే ఆడియన్స్ కన్విన్స్ అవ్వరు.
‘ఇందులో హీరో మూగవాడు. ఈ తరహా పాత్రను తెలిసిన నటుడు చేస్తే ఆడియన్స్ కన్విన్స్ అవ్వరు. అందుకే ఫ్రెష్‌గా ఉంటుందని అనీష్ని తీసుకున్నాం. అనీష్ అద్భుతంగా నటించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో కూడా ఎక్కడా డూప్ వాడలేదు. తానే స్వయంగా చేశాడు. కథానాయిక అనస్వరకు కూడా కథ నచ్చడం, ఆమె ఓకే చెప్పడంతో కాన్ఫిడెంట్‌గా ముందుకెళ్లాం’ అని నిర్మాత వెంకీ కుడుముల అన్నారు.
అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున సమర్పణలో ఆయన నిర్మించిన చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన చిత్రానికి మహేశ్ ఉప్పల దర్శకుడు. ఈ నెల 13న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో వెంకీ కుడుముల విలేకరులతో మాట్లాడారు. ‘ఒక మంచి కథతో సినిమా నిర్మించాలనే కోరిక ఎప్పట్నుంచో ఉండేది.
దర్శకుడు మహేశ్ అలాంటి కథనే చెప్పాడు. చాలా ఆసక్తికరమైన కథ ఇది. తను అంతకుముందు ఒక వెబ్ సిరీస్ చేశాడు. ఆది బాగా ఆడింది. కానీ అతనికి గ్యాప్ వచ్చింది. ఈ సమయంలో తను రాపిడో డ్రైవర్‌గా కూడా పనిచేశాడు. అది విన్నప్పుడు జెన్యూన్‌గా అనిపించింది. తను చాలా టాలెంటెడ్. నేనూ ఒకరు అవకాశం ఇవ్వడం వల్లే డైరెక్టర్ని అయ్యాను. అందుకే.. మహేశ్ కోసం నిలబడాలనిపించింది. మరో ఆలోచన లేకుండా నిర్మాణానికి పూనుకున్నా’ అని తెలిపారు వెంకీ కుడుముల.
‘నాగార్జున సార్ ఈ సినిమాను ప్రజెంట్ చేస్తుండటం ఆనందంగా ఉంది. ఆయన ఈ ప్రాజెక్ట్‌లోకి రాకముందు సినిమా విడుదల విషయంలో ఒత్తిడి ఫీలయ్యేవాడ్ని. ఆయన రావడంతో మా వర్క్ ఈజీ అయింది. గ్లింప్స్ చూపించి, నచ్చితే వాయిస్ ఓవర్ చెప్పమని అడిగాం. గ్లింప్స్ నచ్చి, ఆయన వాయిస్ఓవర్ ఇచ్చారు. తర్వాత సినిమా మొత్తం చూశారు. ఆయనకు చాలా నచ్చింది. అందర్నీ మెచ్చుకున్నారు. ఆ తర్వాతే ప్రజెంటర్‌గా ముందుకొచ్చారు. అంతపెద్ద స్టార్ అభినందనలు అందుకోవడం గొప్ప అనుభవం’ అని వెంకీ కుడుముల ఆనందం వెలిబుచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

