Jana Nayagan | ‘జననాయగన్’ విడుదలపై కొనసాగుతున్న అనిశ్చితి.. బయ్యర్లకు డబ్బులు వెనక్కి ఇవ్వనున్న నిర్మాత?
Jana Nayagan | తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటైన ‘జననాయగన్’ విడుదలపై ఇంకా స్పష్టత రాకపోవడం అభిమానుల్లో నిరాశను పెంచుతోంది. దళపతి విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం తొలుత సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది.
Jana Nayagan | తమిళ సినీ పరిశ్రమలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటైన ‘జననాయగన్’ విడుదలపై ఇంకా స్పష్టత రాకపోవడం అభిమానుల్లో నిరాశను పెంచుతోంది. దళపతి విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం తొలుత సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్‌కు సంబంధించిన సమస్యల కారణంగా చివరి నిమిషంలో సినిమా విడుదల వాయిదా పడింది. ఆ సమయంలో కొన్ని రోజులు లేదా వారాల్లోనే సినిమా థియేటర్లలోకి వస్తుందని భావించిన అభిమానులకు షాక్ ఇస్తూ, నెలలు గడిచినా ఈ చిత్రం విడుదల కాలేదు. అంతేకాదు, కొత్త విడుదల తేదీని కూడా చిత్ర బృందం ప్రకటించకపోవడంతో ‘జననాయగన్’ భవితవ్యంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దళపతి విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ‘జననాయగన్’ చిత్రానికి ఎదురవుతున్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయని, త్వరలోనే సినిమా విడుదల అవుతుందని అభిమానులు ఆశించారు. అయితే విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు నెల రోజులు కావొస్తున్నా, సినిమా విడుదలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అభిమానుల్లో అసహనం పెరుగుతోంది. విజయ్ రాజకీయ ప్రస్థానం నేపథ్యంలో ఆయన చివరి చిత్రంగా ప్రచారం పొందుతున్న ఈ సినిమాను భారీ స్థాయిలో థియేటర్లలో సెలబ్రేట్ చేయాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇదే సమయంలో కోలీవుడ్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. ‘జననాయగన్’ విడుదల అనుకున్న తేదీ నుంచి ఐదు నెలలకుపైగా ఆలస్యం కావడంతో, ఇప్పటికే జరిగిన డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాలను నిర్మాత రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. చిత్ర నిర్మాత నారాయణ, బయ్యర్ల నుంచి తీసుకున్న అడ్వాన్స్ మొత్తాలను తిరిగి చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేవలం అసలు మొత్తమే కాకుండా, ఆ డబ్బులపై వడ్డీ కూడా జోడించి తిరిగి ఇవ్వాలని యోచిస్తున్నారనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.ఈ నిర్ణయానికి స్వయంగా విజయ్ సూచనలు కూడా ఉన్నాయని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.తాజా ప్రచారం ప్రకారం, సెన్సార్ సహా అన్ని సమస్యలు పూర్తిగా పరిష్కారమైన తర్వాత ‘జననాయగన్’ చిత్రాన్ని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ స్వయంగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో మధ్యవర్తుల పాత్రను తగ్గించి, సినిమా వ్యాపారాన్ని నేరుగా నిర్వహించే అవకాశాలపై చర్చ జరుగుతోంది.
సంక్రాంతి సీజన్లో విడుదల కాకపోవడం, ఐదు నెలల పాటు సినిమా నిలిచిపోవడం వల్ల నిర్మాతకు భారీ నష్టం వాటిల్లినట్లు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఆలస్యం కారణంగా దాదాపు రూ.200 కోట్ల వరకు ఆర్థిక ప్రభావం పడినట్లు ప్రచారం జరుగుతోంది.ఇక సినిమా విడుదలైన తర్వాత వచ్చే ఆదాయాన్ని బట్టి తుది లెక్కలు చూసి, నిర్మాతకు కలిగే నష్టాన్ని తగ్గించే దిశగా విజయ్ కూడా ముందుకు రావచ్చని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే తన పారితోషికంలో కొంత భాగాన్ని వదులుకోవడం లేదా భవిష్యత్తులో మరో ప్రాజెక్ట్ ద్వారా నిర్మాతకు సహకరించడం వంటి మార్గాలపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

