Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
JrNTR | టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అయిన ‘డ్రాగన్’ మూవీ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Dragon Movie | టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అయిన ‘డ్రాగన్’ మూవీ కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. గాయం నుంచి కోలుకుంటున్న తారక్ త్వరలోనే మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని ప్రముఖ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ చిత్రం కోసం ఒక భారీ సెట్‌ను ఇప్పటికే నిర్మించారు. నవంబర్ మొదటి వారం నుంచి ఈ సెట్లో ‘డ్రాగన్’ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్‌తో పాటు చిత్రంలోని ఇతర ప్రధాన తారాగణంపై కొన్ని కీలకమైన, ఉత్కంఠభరితమైన సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.
ఇదిలా ఉంటే, ప్రశాంత్ నీల్ సినిమాలలో ఇప్పటివరకు విజువల్స్ అన్నీ ప్రధానంగా డార్క్, బ్లాక్ అండ్ గ్రే షేడ్స్‌లో ఉండటం తెలిసిందే. అయితే, ఎన్టీఆర్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మాత్రం ఒక ప్రత్యేకత ఉండబోతోందని టాక్. ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ పూర్తిగా కలర్ఫుల్గా, సరికొత్త విజువల్ వండర్లా సాగుతాయని ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, రాక్ స్టార్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. తారక్ కెరీర్లో మరో సరికొత్త మైలురాయిగా నిలవబోతున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ తారాస్థాయికి చేరుకుంటున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

