అమ్మ చెప్పింది..
తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రణీత.. ఇప్పుడు మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నది. ఈమధ్యే, మలయాళ సినిమాకు సంతకం చేసింది. క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం కచ్చితమైన నిర్ణయం తీసుకునే శక్తి మహిళకు ఉందన్నది ప్రణీత నిశ్చితాభిప్రాయం.
తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రణీత.. ఇప్పుడు మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నది. ఈమధ్యే, మలయాళ సినిమాకు సంతకం చేసింది. క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం కచ్చితమైన నిర్ణయం తీసుకునే శక్తి మహిళకు ఉందన్నది ప్రణీత నిశ్చితాభిప్రాయం. పెండ్లయిన తర్వాత.. ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉన్న ప్రణీత, గత జూలైలో పండంటి పాపకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి వయసు ఏడు నెలలు.
అమ్మ తనపు బ్రేక్ తర్వాత.. తొలిసారిగా మలయాళ తెరపై కనిపించనుంది ప్రణీత. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సినిమాలే ప్రపంచంగా బతికేస్తున్న నాకు.. పాప సర్వస్వం అయిపోయింది. రోజులు క్షణాల్లో గడిచిపోయాయి. నా జీవనశైలి మారి పోయింది. అసలు, మళ్లీ నేను సినిమాల్లో నటిస్తాననే అనుకోలేదు. చిన్న పాపను ఇంట్లో వదిలిపెట్టి షూటింగ్లో పాల్గొనాలంటే కష్టంగా ఉంటుంది కూడా. అమ్మ ఇచ్చిన మద్దతు వల్లే ఇదంతా సాధ్యమైంది.

నా కోసం వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలని అనిపించలేదు. అదే మాట అమ్మతో చెప్పాను. నా నిర్ణయానికి మద్దతుగా నిలిచింది తను. ఆ ప్రోత్సాహం ఎప్పటికీ మరిచిపోలేను. ‘పాపను నేను చూసుకుంటా. నువ్వు కెరీర్ మీద దృష్టి పెటు’్ట అని ధైర్యం చెప్పింది. సాధికారత అనేది ఉపన్యాసాలతోనో, ఉద్యమాలతోనో రాదు. స్వయంకృషితో వస్తుంది. అపజయాలకు భయపడి వెనకడుగు వేస్తే.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోతాం’ అంటున్నది ప్రణీత. అవును, మహిళకు మాతృత్వం అర్హతే కానీ, అనర్హత కాకూడదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

