Pranavi Manukonda | తెలుగమ్మాయిని అవ్వడం ప్లస్సే అనుకుంటా.. ప్రణవి మానుకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Pranavi Manukonda | ‘తెలుగు అమ్మాయిని అవ్వడం ప్లస్గానే భావిస్తాను. మనకు వుండే నేటివిటీ మన వాళ్లకే వుంటుంది. పక్క భాషల నుంచి వచ్చే వారికి వుండదు’ అన్నారు కథానాయిక ప్రణవి మానుకొండ. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్'.
Pranavi Manukonda | ‘తెలుగు అమ్మాయిని అవ్వడం ప్లస్గానే భావిస్తాను. మనకు వుండే నేటివిటీ మన వాళ్లకే వుంటుంది. పక్క భాషల నుంచి వచ్చే వారికి వుండదు’ అన్నారు కథానాయిక ప్రణవి మానుకొండ. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. సంజయ్ రావు హీరోగా నటించిన ఈ చిత్రానికి ఏఆర్ శ్రీధర్ దర్శకుడు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించారు. ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రణవి మానుకొండ మీడియాతో ముచ్చటించారు. ఆమె మాట్లాడుతూ ‘నాకు చిన్నప్పటి నుండి నటన అంటే ఇష్టం.
అనుష్క నటించిన ‘అరుంధతి’ సినిమా డైలాగ్స్‌ని అద్దం ముందు నిల్చుని చెప్పేదాన్ని. అమ్మ నాన్న కూడా ప్రోత్సాహించారు. రోటిన్ లవ్‌స్టోరీ, ఉయ్యాల జంపాల చిత్రాలతో గుర్తింపు వచ్చింది. ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ టైటిల్‌తో పాటు కథ కూడా కొత్తగా వుంటుంది. పూర్తి వినోదాత్మకంగా వుంటుంది. నేను చేసిన మౌనిక పాత్ర కూడా కొత్తగా వుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్ ఈ పాత్రలో వుంటాయి. అందుకే ఈ సినిమాను చేశాను. పాత్ర డిమాండ్ చేస్తే గ్లామర్ అయినా డీగ్లామర్గానైనా నటిస్తాను’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

