Prabhas | స్వల్పంగా గాయపడ్డ ప్రభాస్
Prabhas | అగ్రకథానాయకుడు ప్రభాస్ స్వల్పంగా గాయపడ్డారు. సినిమా షూటింగ్లో భాగంగా ఆయన కాలికి గాయమైనట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆయన డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.
Prabhas | అగ్రకథానాయకుడు ప్రభాస్ స్వల్పంగా గాయపడ్డారు. సినిమా షూటింగ్లో భాగంగా ఆయన కాలికి గాయమైనట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆయన డాక్టర్ల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా ఈ ఏడాది విడుదలైన బ్లాక్‌బస్టర్ ‘కల్కి 2898ఏడీ’ సినిమా.. వచ్చే ఏడాది జనవరి 3న జపాన్‌లో విడుదల కానుంది.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆయన పాల్గొనాల్సివుంది. కానీ అనుకోకుండా ఆయన గాయపడటంతో జపాన్‌లో జరిగే కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. ఈ విషయాన్ని తన సోషల్‌మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ‘నాపై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానానికి ధన్యవాదాలు.
మూవీ షూటింగ్లో కాలికి గాయం అయ్యింది. అందుకే జపాన్‌లో జరిగే కార్యక్రమానికి రాలేకపోతున్నాను. జపాన్‌లోని అభిమానులను ఎప్పట్నుంచో కలవాలనుకుంటున్నా. కానీ కుదర్లేదు.. క్షమించండి..’ అంటూ పోస్ట్ ద్వారా స్పందించారు ప్రభాస్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

