17 Years For Billa | ప్రభాస్ ‘బిల్లా’ కు 17 ఏండ్లు.. మెహర్ రమేష్ ఎమోషనల్ పోస్ట్.!
Billa | రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో అత్యంత స్టైలిష్ మూవీగా నిలిచిన 'బిల్లా' (Billa) విడుదలై నేటికి సరిగ్గా 17 ఏళ్లు పూర్తయింది.
17YearsForBilla | రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్లో అత్యంత స్టైలిష్ మూవీగా నిలిచిన ‘బిల్లా’ విడుదలై నేటికి సరిగ్గా 17 ఏళ్లు పూర్తయింది. 2009 ఏప్రిల్ 3న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, టాలీవుడ్లో స్టైలిష్ యాక్షన్ చిత్రాలకు సరికొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచింది. ఈ సందర్భంగా దర్శకుడు మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ ప్రత్యేకమైన రోజున దర్శకుడు మెహర్ రమేష్ X వేదికగా స్పందిస్తూ సినిమా షూటింగ్ విశేషాలను నెమరువేసుకున్నాడు. బిల్లా సినిమా స్టైల్ అండ్ స్వాగ్‌కు సరికొత్త నిర్వచనమని, మణిశర్మ అందించిన సంగీతం ఒక మ్యాజిక్ అని ఆయన పేర్కొన్నారు. తన విజన్‌కు తగ్గట్టుగా మేకింగ్ ఉందని, తమ చిత్ర బృందం అత్యంత వేగంగా కేవలం 4 నెలల్లోనే ఈ భారీ చిత్రాన్ని రూపొందించిందని వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ నవంబర్ 12, 2008న ప్రారంభం కాగా, ఏప్రిల్ 3, 2009న విడుదలైంది. ఆయన తన పోస్ట్‌లో ప్రభాస్‌ను “మన హృదయాల డాన్” అని అభివర్ణించాడు.
మెహర్ రమేష్ తన పోస్ట్‌లో ఈ చిత్రంలో భాగమైన నటీనటులైన రెబల్ స్టార్ కృష్ణంరాజు, అనుష్క శెట్టి, నమిత, హన్సిక, సుబ్బరాజులతో పాటు నిర్మాతలు నరేంద్ర, ప్రభోద్లను కూడా ట్యాగ్ చేస్తూ గుర్తుచేసుకున్నాడు. అలాగే సాంకేతిక నిపుణులైన మణిశర్మ, సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్, ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్, ఫైట్ మాస్టర్ స్టన్ శివ, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం విడుదలై 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. నెట్టింట #17YearsForBilla, #Prabhas వంటి హ్యాష్‌ట్యాగ్‌లు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ప్రభాస్ ద్విపాత్రాభినయం, అనుష్క గ్లామర్, మలేషియా లొకేషన్లు మరియు మణిశర్మ అందించిన అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూనే ఉన్నాయి.
BILLA
Style n swag redefined
Music made Magic
Making matched Vision
Fastest made film “in just 4 months”
Nov12th 2008 Filming started
April3rd 2009 released
RebelStar our Don of Hearts #prabhas ❤️ #Billa 🔥#17yearsforBilla 🎉 @GopiKrishnaMvs #krishnamrajugaru #narendra… pic.twitter.com/3S4DIaWao3— Meher Raamesh (@MeherRamesh) April 3, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
TVK | తమిళనాడులో టీవీకే విజయం.. బెంగాల్లో బీజేపీ విక్టరీ.. అభినందించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

